Weather Update : పలు రాష్ట్రాల్లో నేడు భారీవర్షాలు…ఐఎండీ తాజా వెదర్ రిపోర్ట్

దేశంలోని పలు రాష్ట్రాల్లో శనివారం భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. డిల్లీ, నోయిడా, గురుగ్రామ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు....

Weather Update : దేశంలోని పలు రాష్ట్రాల్లో శనివారం భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ వెల్లడించింది. డిల్లీ, నోయిడా, గురుగ్రామ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు. యమునా నదిలో నీటిమట్టం ప్రమాదస్థాయి కంటే అధికంగా చేరింది. (IMD Predicts Heavy Rainfall) రానున్న 24 గంటల్లో ఢిల్లీలో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Pakistan University : పాక్ యూనివర్శిటీలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు…వెలుగుచూసిన షాకింగ్ వీడియోలు

ఢిల్లీ, నోయిడా, దాద్రీ, గ్రేటర్ నోయిడా, ఫరీదాబాద్, లోని దేహత్, హిండన్ ఏఎఫ్ స్టేషన్, ఘజియాబాద్, ఇందిరాపురం, గురుగ్రామ్, ఎన్సీఆర్ లోని మానేసర్‌లోని కొన్ని ప్రదేశాల్లో తేలికపాటి నుంచి మోస్తరు తీవ్రతతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. (Thundershowers Lash Delhi-NCR) రాగల 24 గంటల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దమోహ్, సాగర్, పన్నా, రేవా జిల్లాలు, రాజస్థాన్‌లోని అల్వార్, భరత్‌పూర్, దౌసా, ధోల్‌పూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మహారాష్ట్ర, గుజరాత్‌లలో భారీ వర్షపాతం కొనసాగుతోంది.

Military Helicopter Crash : కుప్పకూలిన ఆస్ట్రేలియన్ మిలటరీ హెలికాప్టర్…నలుగురి గల్లంతు

మహారాష్ట్ర , గుజరాత్‌లలో కుండపోత వర్షాలు విధ్వంసం సృష్టించాయి. (Maharashtra, Karnataka) మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాల్లో రాబోయే 5 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ, కోస్తా కర్ణాటకలో తేలికపాటి నుంచి మోస్తరు నుండి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమై తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Earthquake : అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం

కోస్తా కర్ణాటక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈశాన్య, తూర్పు భారతదేశంలో భారీ వర్షపాతాన్ని అంచనా వేసింది. జులై 29 నుంచి జూలై 31 వరకు ఒడిశాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్,సిక్కింలలో జులై 30వతేదీ నుంచి ఆగస్టు 1వతేదీ వరకు భారీవర్షాలు కురుస్తాయి. జార్ఖండ్ రాష్ట్రంలో జులై 30, 31 తేదీల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది.

ట్రెండింగ్ వార్తలు