wanted criminal shot dead : యూపీలో వాంటెడ్ క్రిమినల్ ఎన్‌కౌంటర్
: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరడుకట్టిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను మంగళవారం ఉదయం యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. యూపీకి చెంది గుఫ్రాన్ పేరు మోసిన క్రిమినల్. ఇతనిపై పలు హత్యలు, దోపిడీ కేసులున్నాయి....
- saleem sk
- Published On : June 27, 2023 / 08:14 AM IST
wanted criminal shot dead
wanted criminal shot dead : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరడుకట్టిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను మంగళవారం ఉదయం యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. యూపీకి చెంది గుఫ్రాన్ పేరు మోసిన క్రిమినల్. ఇతనిపై పలు హత్యలు, దోపిడీ కేసులున్నాయి. కౌషంబి ప్రాంతం మాంజన్ పూర్ సందా షుగర్ మిల్లు సమీపంలో మంగళవారం ఉదయం యూపీ ఎస్టీఎఫ్ పోలీసులతోజరిగిన ఎన్‌కౌంటర్ లో గుఫ్రాన్ హతం అయ్యాడు. (murder and dacoity cases shot dead)
Jammu And Kashmir : జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్..ఉగ్రవాది హతం
గుఫ్రాన్ కాల్పుల్లో నేలకొరగడంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా మరణించాడని డాక్టర్లు ధ్రువీకరించారు. ప్రతాపఘడ్, సుల్తాన్ పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాల్లో గుఫ్రాన్ పై 13 హత్యలు, లూటీలు, దోపిడీ కేసులున్నాయి. ఇతన్ని పట్టిచ్చిన వారికి 1.25 లక్షల రివార్డు కూడా పోలీసులు ప్రకటించారు.
Vijay : ఆంధ్రప్రదేశ్‌లో విజయ్ లియో షూటింగ్.. ఎక్కడో తెలుసా?
ఈయనపై ఉన్న రివార్డును ప్రయాగరాజ్, సుల్తాన్ పూర్ పోలీసులకు ఇస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. గుఫ్రాన్ మోటారు సైకిలుపై వెళుతూ పోలీసులపై కాల్పులు జరపగా, సాయుధ పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు.
