washing machine blast
washing machine blast : భూమి మీద నూకలు ఉంటే చాలు మత్యువు (death) కూడా పక్కనుంచి వెళ్లిపోవాల్సిందే .. ఘోర ప్రమాదాల నుంచి సైతం అలా త్రుటిలో ప్రాణాలు దక్కించుకున్న వారికి సంబంధించి ఎన్నో సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. ఓ లాండ్రిలో (laundry) అకస్మాత్తుగా వాషింగ్ మెషీన్ (washing machine) పేలింది. లాండ్రీలో భారీ పేలుడుతో (explosion) మంటలు వ్యాప్తించాయి. ఈ ఘటన జరగానికి కొన్ని సెకండ్ల ముందు బయటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నిత్యం మనం ఎన్నోరకాల ప్రమాదాల గురించి వింటూ ఉంటాం. చూస్తూ ఉంటాం. రీసెంట్గా వాషింగ్ మెషీన్లు పేలడం లాంటి ప్రమాదాల గురించి వింటున్నాం. ఓ లాండ్రీలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. లాండ్రీ నుంచి బ్యాగ్లతో ఓ వ్యక్తి డోర్ తీసుకుని బయటకు వెళ్లాడు. అంతే క్షణాల్లో వాషింగ్ మెషీన్ నుంచి పేలుడు సంభవించింది. ఆ తరువాత రూం మొత్తం మంటలతో కాలిపోయింది. వీడియో చూస్తే మాత్రం ఎవరికి ప్రాణ హాని జరగలేదని తెలుస్తోంది. రూం మొత్తం పేలినప్పుడు చుట్టుపక్కల ఎవరైనా గాయపడి ఉండొచ్చునా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు.
ఓన్లీ బ్యాంగర్స్ (only bangers) అనే యూజర్ ట్విట్టర్ లో (twitter) ఈ ఘటనకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ ఘటనపై యూజర్లు రకరకాల కామెంట్లు చేశారు. కొందరు ఆ వ్యక్తిని కాపాడినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పగా.. మరికొందరు ఈ ఘటన ఎలా జరిగి ఉండవచ్చునో అని అనుమానం వ్యక్తం చేశారు.
Someone didn’t check their pockets pic.twitter.com/MjpK5mPba7
— OnlyBangers (@OnlyBangersEth) April 2, 2023