Covid Positive: అందాల పోటీలో పాల్గొన్న విన్నర్‌తో సహా 13మందికి పాజిటివ్
అందాల పోటీలో పాల్గొన్న 13మంది అందగత్తెలకు కొవిడ్ పాజిటివ్ సోకింది. గత నెలలో జరిగిన ఈ ఈవెంట్‌లో మొత్తం 22మందికి ఇన్ఫెక్షన్ సోకిన్టుల అధికారులు చెప్తున్నారు.
- Subhan Ali Shaik
- Published On : July 13, 2021 / 11:26 AM IST
Covid Positivie (1)
Covid Positive: అందాల పోటీలో పాల్గొన్న 13మంది అందగత్తెలకు కొవిడ్ పాజిటివ్ సోకింది. గత నెలలో జరిగిన ఈ ఈవెంట్‌లో మొత్తం 22మందికి ఇన్ఫెక్షన్ సోకిన్టుల అధికారులు చెప్తున్నారు. థాయ్ లాండ్ ప్రస్తుతం కరోనావైరస్ మహమ్మారితో పోరాడుతున్న క్రమంలో ఇలా జరగడంపై బ్యాంకాంక్ బ్యూటీ కాంటెస్ట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
13మంది పోటీదారులకు, మరో 9మంది సిబ్బందికి పాజిటివ్ వచ్చినట్లు బ్యాంకాంక్ పోస్ట్ వెల్లడించింది. పాజిటివ్ వచ్చిన వారిలో విన్నర్ Pornchanok Srikaeoకూడా ఉన్నారు. అభ్యర్థులతో పాటు నిర్వాహకులు పబ్లిక్ హెల్త్ రూల్స్ పట్టించుకోకుండా ప్రవర్తించారు. కొన్ని ప్రత్యేక పరిమితులతో మాత్రమే అనుమతి ఇచ్చామని పోలీసులు ఆరోపించారు. దీనికి బాధ్యులైన వారందరిపైన యాక్షన్ తీసుకుంటామని అన్నారు.
ఈ పోటీ జరిగిన సమయం అంతా కంటెస్టెంట్లు గౌన్లలో కనిపిస్తూ మాస్కులు అస్సలు ధరించలేదని సోషల్ డిస్టెన్సింగ్ నామమాత్రంగానే ఉందని అన్నారు. దీనిపై ఆర్గనైజర్లు ఎటువంటి అధికారిక స్టేట్మెంట్ రిలీజ్ చేయలేదు. ఇదిలా ఉంటే థాయ్ లాండ్ లో సోమవారం 8వేల మందికి పాజిటివ్ రగా 80మృతులు సంభవించాయని రికార్డులు చెబుతున్నాయి.
