Helicopter Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన అరామ్‌కో హెలికాప్టర్.. 14 మంది దుర్మరణం
సౌదీ అరేబియాలోని రాస్ తనూరా వద్ద ఆదివారం ఉదయం ఘోర హెలికాప్టర్ ప్రమాదం(Helicopter Crash) సంభవించింది.
- V Santhosh Kumar
- Published on- June 28, 2026 / 07:01 PM IST
14 people killed in helicopter crash in Saudi Arabia.
Helicopter Crash: సౌదీ అరేబియాలోని రాస్ తనూరా వద్ద ఆదివారం ఉదయం ఘోర హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. సౌదీ అరామ్‌కో సంస్థకు చెందిన హెలికాప్టర్ ఉదయం సుమారు 6:00 గంటల సమయంలో కూలిపోవడంతో, అందులో ప్రయాణిస్తున్న 14 మంది సౌదీ జాతీయులు అక్కడికక్కడే మరణించారు. ఈ విషాద ఘటనపై సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో మరణించిన వారంతా సౌదీ పౌరులేనని ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థ సౌదీ ప్రెస్ ఏజెన్సీ (SPA) ధృవీకరించింది.
Hormuz Strait: 30 రోజుల్లో హార్ముజ్ ఓపెన్.. కానీ, ఆధిపత్యం మాదే.. ఇరాన్ విదేశాంగ మంత్రి వార్నింగ్
హెలికాప్టర్ ప్రమాదానికి(Helicopter Crash) గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ప్రమాదం జరిగిన తీరును, దానికి గల సాంకేతిక లేదా ఇతర కారణాలను నిర్ధారించడానికి సంబంధిత ఉన్నతాధికారుల సమక్షంలో విస్తృత దర్యాప్తు కొనసాగుతోంది. భద్రతా సిబ్బంది మరియు నిపుణుల బృందం ఘటనా స్థలంలో ఆధారాలను సేకరిస్తోంది.
వ్యూహాత్మక హర్మూజ్ జలసంధి సమీపంలో ఉన్న రాస్ తానూరా టెర్మినల్ అత్యంత కీలకమైనది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇక్కడ దాదాపు నాలుగు నెలల పాటు చమురు రవాణా నిలిచిపోయింది. అయితే, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గి, కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ ఘోర ప్రమాదం జరగడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
