Nigeria: నైజీరియా రోడ్డు ప్రమాదంలో 18మంది మృతి
నైజీరియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. జిగావా ప్రాంతంలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో 18మంది అక్కడికక్కడే చనిపోయారు. బిర్నింకుడు ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు..
- Subhan Ali Shaik
- Updated on- June 10, 2021 / 11:16 AM IST
Nigeria
Nigeria: నైజీరియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. జిగావా ప్రాంతంలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో 18మంది అక్కడికక్కడే చనిపోయారు. బిర్నింకుడు ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు గుద్దుకున్నాయని జిగావా పోలీసులు చెప్పారు.
గాయాలతో బయటపడ్డ డైవర్ ను స్థానిక హాస్పిటల్ కు తరలించడంతో కోలుకున్నారు. రోడ్డు ప్రమాదంపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని పోలీసు అధికారులు వెల్లడించారు. నైజీరియాలో తరచూ జరుగుతోన్న రోడ్డు ప్రమాదాలకు ఓవర్ లోడింగ్, రోడ్ కండీషన్ బాగుండకపోవడం, నిర్లక్ష్య పూరితమైన డ్రైవింగ్ కారణమని అంటున్నారు.
