Gold Treasure: మురికి కాలువలో రూ.98 కోట్ల బంగారం.. కోటీశ్వరుడిగా మారిన కుర్రాడు.. చివరికి ట్విస్ట్ అదుర్స్

కూలీ పనిచేసుకునే 18 ఏళ్ల యువకుడికి డ్రెయినేజీ పనులు చేస్తుండగా ఏకంగా రూ.98 కోట్ల విలువైన పురాతన బంగారు నిధి(Gold Treasure) దొరికిన సంచలన సంఘటన బెల్జియంలో వెలుగుచూసింది.

18 year old finds 98 crore gold treasure in drainage excavation

  • డ్రెయినేజీ గుంతలో అరుదైన నిధి
  • రూ.98 కోట్ల విలువైన బంగారం
  • ఒక్కసారిగా మారిన కుర్రాడి తలరాత

Gold Treasure: ఒక్కోసారి అదృష్టం ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. సాధారణ రోజువారీ కూలీ పనిచేసుకునే ఒక 18 ఏళ్ల యువకుడికి డ్రెయినేజీ పనులు చేస్తుండగా ఏకంగా రూ.98 కోట్ల విలువైన పురాతన బంగారు నిధి (Gold Treasure)దొరికిన సంచలన సంఘటన బెల్జియంలో వెలుగుచూసింది. బ్రస్సెల్స్ ప్రాంతంలో మురుగు కాల్వ పైపుల కోసం భూమిని తవ్వుతున్న సమయంలో పారకు ఒక లోహపు పెట్టె తగలడంతో ఈ అరుదైన నిధి బయటపడింది.

Tarapith Fire Accedent: తారాపీఠ్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు సజీవదహనం.. బెంగాల్‌లో విషాదం

పెట్టెలో శతాబ్దాల నాటి అరుదైన ఆభరణాలు:

ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో శతాబ్దాల క్రితం నాటి పురాతన బంగారు నాణేలు, అత్యంత అరుదైన ఆభరణాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పురావస్తు శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ దాదాపు రూ.98 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.

చట్టప్రకారం దక్కనున్న వాటా:

ఈ ఊహించని ఘటనతో ఆ యువకుడి జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. బెల్జియం స్థానిక చట్టాల ప్రకారం లభించిన ఈ నిధిలో తవ్వకాలు జరిపిన యువకుడికి, ఆ స్థల యజమానికి తగినంత వాటా దక్కనుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది.