3 days old baby shocking video
Viral Video : పుట్టి జస్ట్ మూడు రోజులు .. హాస్పిటల్ బెడ్ మీద చిన్నారి తల ఎత్తి పాకడం చూసిన తల్లి షాకైంది. మునుపెన్నడూ ఇలాంటిది చూడలేదంటూ తన అనుభవాన్ని చిన్నారి తల్లి షేర్ చేసింది.
Delhi Metro : ఢిల్లీ మెట్రోలో బెస్ట్ పెర్‌ఫార్మెన్స్.. చిన్నారి డ్యాన్స్‌కి నెటిజన్లు ఫిదా
పెన్సిల్వేనియాకు చెందిన US నివాసి 34 ఏళ్ల సమంత మిచెల్‌కి పుట్టిన మూడు రోజుల చిన్నారి వీడియో ఇప్పుడు అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. చిన్నారి నైలా పుట్టిన మూడు రోజులకే తలపైకి ఎత్తి బెడ్‌పై పాకడం సమంతని ఆశ్చర్యానికి గురి చేసింది. తన కూతురిలో ఉన్న ప్రత్యేకతను చూపించడానికి ఆమె వీడియో రికార్డ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ లోsamantha__elizabeth అనే పేరుతో షేరైన వీడియో చూస్తే అందరూ ఔరా అంటారు. ఇక సమంత కూతురు చేసిన ఫీట్లు కూడా తన భర్త నమ్మడనే సందేహంతో ఈ వీడియో రికార్డు చేశారట. వీడియోలో నైలా బెడ్‌పై పాకుతూ.. తలని పైకి ఎత్తినపుడు చేతులతో సపోర్ట్ తీసుకుంటూ తనలోని శక్తి సామర్థ్యాలు చూపించింది.
నైలాకి ఇప్పుడు మూలు నెలల వయసు. అందరి చిన్నారుల కంటే భిన్నంగా ఆమె ఎదుగుతోందట. త్వరలోనే నడిచేస్తుందని తల్లి మిచెల్ అంచనా వేస్తోంది. ‘నాకు ఏ మాత్రం డౌట్ లేదు ఆమె తప్పకుండా త్వరలోనే నడిచేస్తుంది’ అని ధీమాగా చెబుతోంది. ఏది ఏమైనా నైలా ‘వండర్ బేబీ’ అని చెప్పాలి.