113 దేశాలకు పాకిన కరోనా వైరస్…ప్రపంచవ్యాప్తంగా 4 వేల 9 మంది మృతి

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 4 వేల 9కి చేరింది.

  • Publish Date - March 10, 2020 / 01:55 AM IST

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 4 వేల 9కి చేరింది.

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 4 వేల 9కి చేరింది. లక్షా 14 వేల 285 మంది కరోనా బాధితులు ఉన్నారు. 6 వేల 88 మందికి సీరియస్ గా ఉంది. 113 దేశాలకు వైరస్ పాకింది. కరోనా వైరస్ చైనాలో తగ్గి ఇతర దేశాల్లో పెరుగుతోంది. 

ఇటలీలో నిన్న ఒక్కరోజే 1797 కేసులు నమోదు అయ్యాయి. 97 మంది మృతి చెందారు. ఇరాన్ లో నిన్న 595 కేసులు నమోదు అయ్యాయి. 43 మంది మృతి చెందారు. చైనాలో కేవలం 4 కేసులు నమోదు అయ్యాయి. ఒకరు మృతి చెందారు. 

మార్చి 9నాటికి భారత్‌లో మొత్తం 43 కరోనా కేసులు నమోదయ్యాయి. 40కేసులు ఇంకా ట్రీట్‌మెంట్ దశలోనే ఉన్నప్పటికీ కేరళలోని ముగ్గురికి చికిత్స పూర్తయి కోలుకున్నారు. కరోనా పేషెంట్ల కోసం భారత దేశవ్యాప్తంగా 52 టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. Covid-19 లక్షణాలు ఏం కనిపించినా కింది సెంటర్లలో సంప్రదించాలని వైద్యులు అంటున్నారు.

హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తొలి కరోనా బాధితుడు కోలుకున్నాడు. కొన్నిరోజుల చికిత్స అనంతరం అతనికి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది.  మరోసారి నిర్ధారణ కోసం బ్లడ్ శ్యాంపిల్స్ పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించనున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయిన ఈ యువకుడు దుబాయ్‌ వెళ్లి వచ్చి కరోనా బారినపడ్డాడు.

అనంతరం సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. మెరుగైన చికిత్స, వైద్యుల నిరంతర పర్యవేక్షణతో క్రమంగా యువకుడి ఆరోగ్యం కుదుటపడింది. తొలి మూడు రోజులు ఎలా ఉంటుందో? ఏమౌతుందోనని ఆందోళన చెందిన వైద్యులు ఇప్పుడిక ఇబ్బంది లేదని నిర్ధారణకు వచ్చారు.

See More :

*  గాంధీ ఆస్పత్రిలో కోలుకున్న కరోనా తొలి బాధితుడు

*  కాల్ చేస్తే కరోనా దగ్గు వినిపిస్తుందా.. ఇలా ఆపేయండి

శ్రీలంక బౌద్ధ తీర్థయాత్రికులకు భారత్‌కు నో ఎంట్రీ