Switzerland Woman In mumbai search of her mother
Switzerland Woman In mumbai search of her mother : ఓ తల్లి పుట్టిన బిడ్డను అనాధాశ్రమంలో వదిలేసింది. కానీ ఆబిడ్డ మాత్రం ఖండాలు దాటిపోయింది. అక్కడే పెరిగింది. పెద్దదైంది. 44 ఏళ్లు వచ్చాయి. ఈక్రమంలో తన కన్నతల్లిని చూడాలని తపనపడింది. తనను పెంచిన తల్లిదండ్రుల ద్వారా తన తల్లి పేరు తెలుసుకుంది. ఆమెది భారత్ అని తెలుసుకుంది..తనకు జన్మ ఇచ్చి, పుట్టిన వెంటనే అనాధ శరణాలయానికి ఇచ్చేసిన తన తల్లిని చూడాలని తహతహలాడింది. అంతే ఐరోపా ఖండంలో స్విట్జర్లాండ్ నుంచి ఆసియా ఖండంలోని భారత్ కు వచ్చింది. తల్లిది భారత్ అని ఆమె పేరు ఒక్క పేరు రొబెల్లో అని ఆ ఒక్క ఆధారంతో భారత్ లోని ముంబైకి వచ్చింది. అలా 10 సంవత్సరాలుగా తల్లికోసం వెతుకుతునే ఉందా స్విట్జర్లాండ్ కు చెందిన బీనా మఖిజానీ ముల్లర్ అనే 44 ఏళ్ల మహిళ.
స్విట్జర్లాండ్ కు చెందిన మహిళ బీనా మఖిజాని ముల్లర్ 1978లో ఆమె ముంబైలో జన్మించారు. పుట్టిన వెంటనే ఆమె తల్లి ఆమెను అనాథ శరణాలయంలో ఇచ్చేసింది. ఆ తరువాత..ఒక జంట ఆమెను దత్తత తీసుకుని స్విట్జర్లాండ్ తీసుకెళ్లింది. స్విట్జర్లాండ్ లోనే పెరిగి పెద్దదైన బీనా అక్కడే వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అలా తన జీవితంలో చదువు, వివాహం పిల్లల్ని కనటం వంటి పలు సందర్భాల్లో ఆమెకు తనకు జన్మనిచ్చిన తల్లి ఎవరో తెలుసుకోవాలనే కోరిక కలిగేది. కన్నతల్లిని ఒక్కసారైనా చూడగలుగుతానా? అని మదనపడేది. చూడాలని ఆమె మనస్సు తపించేది. ఈక్రమంలో 2011 బీనా తన తల్లిని వెతుక్కుంటూ భారత్ వచ్చింది. తల్లి కోసం బీనా అన్వేషణలో తల్లి పేరు మాత్రమే తెలుసుకుంది.
తనను దత్తత తీసుకున్న తల్లిదండ్రులకు తన తల్లి పేరు రొబెల్లో అని మాత్రమ తెలుసు. అది కూడా దత్తత సమయంలో ఆ అనాధాశ్రమం రికార్డుల్లో ఆ పేరును వారు చూసి ఆమె పెంచిన తల్లిదండ్రులు గుర్తు పెట్టుకున్నారు. అదే విషయాన్ని వారు బీనాకు చెప్పారు. దాంతో, ఆ పేరు ఆధారంగా తన తల్లిని వెతుక్కుంటూ ఆమె ముంబై వచ్చారు.
అప్పటి నుంచి వీలైనన్ని సార్లు ఆమె స్విట్జర్లాండ్ నుంచి ముంబైకి వస్తూనే ఉన్నారు. ఎంతోమందిని వివరాల కోసం కలిసారు. ఈ అన్వేషణలో బీనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ.. తల్లికోసం వెదకటం మానలేదు. 10ఏళ్లుగా ఆ అన్వేషణను ఆపలేదు. ఈ క్రమంలో బీనా ఒక క్విజ్ ప్రొగ్రామ్ లో గెలుచుకున్న మొత్తంతో టికెట్ కొనుక్కుని ముంబై వచ్చారు. ముంబైకి చెందిన అడాప్టీ రైట్స్ కౌన్సిల్ పూణే డైరెక్టర్, అడ్వకేట్ అంజలి పవార్ ఆమెకు సహకరిస్తున్నారు. దత్తత కేంద్రం వారు మొదట వారికి సహకరించలేదని, కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్న తరువాత సహకరించడం ప్రారంభించారని, అయితే, వారి వద్ద రికార్డులు సక్రమంగా లేవని అంజలి వివరించారు.
తన తల్లి పేరు రొబెల్లో అని, ఆమె గోవా ప్రాంతానికి చెంది ఉండొచ్చని భావిస్తున్నానని బీనా తెలిపారు. తన జన్మ విషయాన్ని ఆమె రహస్యంగా ఉంచాలని భావిస్తుండవచ్చని.. ఎందుకంటే పెళ్లికి ముందే తనకు ఆమె జన్మను ఇచ్చి ఉండవచ్చని బీనా భావించారు. అందువల్ల, ఈ విషయాన్ని పూర్తి రహస్యంగా ఉంచుతానని హామీ ఇస్తున్నానని కన్నీటి పర్యంతమవుతుంటే తెలిపారు బీనా. తన తల్లి వివరాలు ఎవరికైనా సమాచారం తెలిసి ఉంటే తనను కానీ, అంజలి పవార్ 9822206485 నంబర్‌లో సంప్రదించాలని బీనా వేడుకుంటున్నారు.తల్లి కోసం వెతికే బీనాతో పాటు ఆమె ఇద్దరు మగపిల్లలు కూడా పలుమార్లు ముంబైకి వచ్చారు. ఈక్రమంలో బీనా మారోసి ఇటీవల అంటే అక్టోబర్ 12న దక్షిణ ముంబైలోని ఓ అనాథాశ్రమానికి వచ్చి వివరాలు సేకరించారు.కానీ ఫలితం లేదు.ఆమెకు మరోసారి నిరాశే ఎదురైంది.
బీనా ప్రయత్నాలకు సహాయం చేసే అంజలి పవార్ మాట్లాడుతూ..బీనా చిన్నప్పుడు దత్తత ఇచ్చిన ఏజెన్సీ కూడా సహాయం చేయటంలేదని..దీంతో DWCD అధికారులను సమాచారం కోసం అడిగానని..కానీ వారు కూడా నన్ను ఆపడానికి ప్రయత్నించారని తెలిపారు. దీంతో నేను సమాచారం కోసం సహకరించాలని కోరుతూ బాంబే హైకోర్టుకు వెళ్లానని..దీంతో దత్తత ఇచ్చిన నివాసం సహకరిస్తోందని కానీ అది సరైన వివరాలు మాత్రం చెప్పటంలేదని తెలిపారు. 9822206485 నంబర్‌లో సంప్రదించండి. DNA సహాయంతో, బీనా ఆ బిడ్డ అని మనం గుర్తించవచ్చు. కన్నతల్లి కోసం తపనపడే బీనా ఆశలు..ఆకాంక్షలు ఫలించాలని కోరుకుందాం.