Elon Musk: నేను మాంచెస్టర్ యునైటెడ్‌ని కొనుగోలు చేస్తున్నా.. మరోసారి వరుస ట్వీట్లతో హల్‌చల్ చేసిన మస్క్
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి వరుస ట్వీట్లతో హల్ చల్ చేశాడు. ట్విటర్ కొనుగోలు విషయంలో విఫలమైన తరువాత ఎలాన్ మస్క్ తాజాగా ఇంగ్లీ ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ ను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పాడు.
- Harishth Thanniru
- Published On : August 17, 2022 / 09:34 AM IST
Elon musk
Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి వరుస ట్వీట్లతో హల్ చల్ చేశాడు. ట్విటర్ కొనుగోలు విషయంలో విఫలమైన తరువాత ఎలాన్ మస్క్ తాజాగా ఇంగ్లీ ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునైటెడ్ ను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పాడు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. స్పష్టంగా చెప్పాలంటే.. రిపబ్లికన్ పార్టీకి చెందిన ఎడమ సగం, డెమోక్రటిక్ పార్టీ యొక్క కుడి సగం నేను మద్దతు ఇస్తున్నాను అంటూ ఆయన ట్వీట్ చేశాడు.
To be clear, I support the left half of the Republican Party and the right half of the Democratic Party!
— Elon Musk (@elonmusk) August 16, 2022
ఈ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ‘అలాగే నేను మాంచెస్టర్ యునైటెడ్ ని కొనుగోలు చేస్తున్నాను’ అంటూ చెప్పారు. ట్విటర్ కొనుగోలు విషయంలో విఫలమైన తరువాత ఎలాన్ మస్క్ ట్వీట్లను నెటిజన్లు జోక్ గా తీసుకుంటున్నారు. ఏదోఒకటి ఇష్టానుసారంగా మస్క్ ట్వీట్లు చేస్తాడని, అందులో నిజాయితీ ఉండదంటూ నెటిజన్లు రీ ట్వీట్లు చేస్తున్నారు. మస్క్ తన ట్వీట్ లో పేర్కొన్న విధంగా ఎంత వరకు కట్టుబడి ఉంటారనేది ఆలోచించాల్సిన ప్రశ్న. ప్రస్తుతం మస్క్ మాంచెస్టర్ యునైటెడ్ ను కొనుగోలు చేస్తానని ట్వీట్ చేయడం వెనుక సరదా వ్యాఖ్యల్లో భాగమే అయిఉంటుందని నెటిజన్లు రీట్వీట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ రీట్వీట్ చేస్తూ.. “యునైటెడ్ ఆటగాళ్ళు చివరకు అంతరిక్షంలో ప్రమాదకరంగా మారబోతున్నారు” అని పేర్కొన్నారు.
