UK: యూకే వెళ్లాల్సిన ప్రయాణికులందరికీ ముఖ్య గమనిక.. మీరు వెళ్లాల్సిన విమానాలన్నీ..

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్‌వర్క్ పనిచేయడం లేదని అన్నారు. యూకేకు రావడానికి టికెట్లు బుక్ చేసుకుని..

UK

UK – Airspace: యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కి వచ్చే విమానాలతో పాటు ఆ దేశం నుంచి వెళ్లే విమానాలన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేశారు. గగనతల ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో యూకే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నెట్‌వర్క్ పనిచేయడం లేదని అన్నారు. యూకేకు రావడానికి టికెట్లు బుక్ చేసుకుని ఇతర దేశాల్లో సిద్ధంగా ఉన్న వారికి విమాన సేవలు ఆలస్యంగా అందుతాయని చెప్పారు. ప్రయాణికుల రక్షణ కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. సాంకేతిక లోపాన్ని పరిష్కరించి, విమానాల రాకపోకలను పునరుద్ధరించడానికి ఇంజనీర్లు పనిచేస్తున్నారని తెలిపారు.

ప్రయాణికులకు కలిగిన అసౌకర్యం పట్ల క్షమాపణలు చెబుతున్నామని తెలిపారు. తమ సేవల తాజా సమాచారం కోసం తమ వెబ్ సైట్ చూడాలని ప్రయాణికులకు విమానయాన సంస్థ లోగానయిర్ సూచించింది. అధికారులతో తాము చర్చిస్తున్నామని ఈజీజెట్ విమానయాన సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Apple 1 computer: ఆపిల్ వ్యవస్థాపకుడు 1976లో చక్కటి దస్తూరితో రాసిన లేఖ.. ఇప్పుడు ఎంతకు అమ్ముడుపోయిందో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు