England famous tree at Hadrias wall
England famous tree at Hadrias wall : ఓ చెట్టును నరికినందుకు ఓ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ భారీ వృక్షాన్ని 16 ఏళ్ల బాలుడు రాత్రికి రాత్రే నరికేశాడు. దీంతో పోలీసులు ఆ బాలుడ్ని అరెస్ట్ చేశారు. సాధారణంగా చెట్లను నరకాలంటే అదికూడా పబ్లిక్ ప్లేస్ లో ఉండే చెట్టుని నరికాలంటే ప్రభుత్వం అనుమతి ఉండాలి. లేదంటే జరిమానా విధిస్తారు. కానీ ఇంగ్లాండ్ లో మాత్రం ఓచెట్టుని నరికి బాలుడిని పోలీసులు అరెస్ట్ చేయశారు. ఎందుకంటే ఆ చెట్టు దాదాపు 300 ఏళ్లనాటిది.ఓ ప్రత్యేకమై ప్లేసులో ఉండేది. రెండు కొండల మధ్య ఠీవీగా నిలబడి ఉండేది.ఆ దృశ్యాన్ని చూడటానికి చాలా బాగుండేది. రెండు శతాబ్దాల క్రితం నాటి చెట్టును 16 ఏళ్ల బాలుడు ఒక్క రాత్రిలోనే పడగొట్టడం ఆశ్చర్యకరమైన విషమనే చెప్పాలి.
కూల్చిన చెట్టు చరిత్ర..
ఇంగ్లండ్ లోని నార్తంబర్లాండ్ లోని ఉన్న చారిత్రక హాండ్రియన్ వాల్ వద్ద ఈ చెట్టు ఉండేది.సైకమోర్గ్యాప్ లో అందంగా కనిపించేది.ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకర్షించేది.రెండు కొండల మధ్యలో ఒకే ఒక్క భారీ చెట్టు ఉన్న ఫోటో సినిమాల్లోను..సోషల్ మీడియాలోను వైరల్ అయ్యేది. హాండ్రియన్ వాల్ వద్ద నడవటానికి ఎంతోమంది సందర్శకులు వస్తుంటారు. వారిని ఈ చెట్టు ఎంతగానో ఆకర్షించేది. ఫోటోలు,వీడియోలు తీసుకునేవారు సందర్శకులు.
joana vasconcelos : నోరూరించే భవనం, చూస్తే తినేయాలనిపించే కేక్ భవనం
ఈ చెట్టుని 1900 సంవత్సరంలో రోమన్ కాలంలో రోమన్లు నాటారల. రోమన్లు నిర్మించిన హాండ్రియన్ వాల్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదల జాబితాలోకి చేర్చింది. రాబిన్ హుడ్: ప్రిన్స్ ఆఫ్ థీవ్స్ సినిమాలో రెండు కొండల మధ్య ఒక చెట్టు కనిపించింది. ఈ సైకమోర్ గ్యాప్‌లో ఉన్న ఆ భారీ వృక్షాన్ని ఓ 16 ఏళ్ల బాలుడు నరికివేయటంతో ఇది కాస్తా పర్యవరణ వేత్తల ఆగ్రహానికి గురైంది. ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ చెట్టు రాత్రికి రాత్రే నరికివేయబడిందని సమాచారం అందుకున్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. చెట్టు నరికింది ఎవరో తెలుసుకున్నారు. ఓ 16 ఏళ్ల బాలుడు రాత్రికి రాత్రే ఈ సుదీర్ధకాలం చరిత్ర ఉన్న చెట్టుని నరికివేశాడని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఆ చెట్టుని ఎందుకు నరికాడు..? ఎందుకు నరకాల్సి వచ్చింది..? అంత తక్కువ సమయంలో అదికూడా రాత్రి సమయంలో ఎందుకు నరికాడు..? అనే విషయాలపై విచారిస్తున్నారు. ఈ చెట్టుని నరికిన నేరానానికి అతనికి జైలుశిక్ష పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంగ్లాండ్‌లోనే అత్యధికంగా ఫొటోలు తీసిన ప్రదేశంగా సైకమోర్ గ్యాప్‌లోని ఆ వృక్షం ఉన్న ప్రాంతం నిలిచింది. దీన్ని ఇంగ్లిష్ ట్రీ ఆఫ్ ది ఇయర్‌గా 2016 లో ఎంపిక చేశారు. ఆ సైకమోర్ గ్యాప్ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్న నేషనల్ ట్రస్ట్ హెరిటేజ్ ఛారిటీ సంస్థ.. ఆ చెట్టను నరికివేయడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.