కరోనావైరస్ కేసుల్లో బ్రెజిల్ ప్రపంచ నంబర్ 2 హాట్‌స్పాట్‌గా నిలిచింది. అమెరికా అగ్రస్థానంలో నిలవగా.. తర్వాతి రెండవ స్థానంలో బ్రెజిల్ ఉంది. మొత్తం 330,890 వైరస్ కేసులతో రష్యాను బ్రెజిల్ అధిగమించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బ్రెజిల్ రోజువారీ 1,001 కరోనావైరస్ మరణాలను నమోదు చేసిందని, మొత్తం మరణాలు 21,048 కు చేరుకున్నాయని పేర్కొంది. Sao Paulo అనే నగరమంతా కరోనాతో అస్తవ్యస్తమైంది. Formosa శ్మశాన వాటికలో కరోనా మృతుల డెడ్ బాడీలతో నిండిపోవడం ఏరియల్ వీడియోలో కనిపించింది.
అధ్యక్షుడు Jair Bolsonaro కరోనా వ్యాప్తిని నియంత్రణ వైఫల్యంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ ఆర్మీ కెప్టెన్ తన పోల్ రేటింగ్స్ పడిపోవడం, సామాజిక దూర చర్యలపై వ్యతిరేకత, క్లోరోక్విన్‌కు మద్దతు ఇవ్వడం, అనుభవజ్ఞులైన ప్రజారోగ్య అధికారులతో గొడవలు పడటం వివాదాస్పదానికి దారితీసింది. లాటిన్ అమెరికా అగ్ర ఆర్థిక వ్యవస్థ కరోనా టెస్టులను వేగవంతం చేయడంలో ఆలస్యం కావడంతో నిజమైన కేసులు, మరణాల సంఖ్య గణాంకాలు సూచించిన దానికంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
కరోనా వ్యాప్తి బ్రెజిల్‌లో వేగవంతం అవుతోంది. బ్రిటన్‌ను అధిగమించి బ్రెజిల్ మూడవ స్థానంలో అత్యధిక అంటువ్యాధులు కలిగిన దేశంగా అవతరించింది. శుక్రవారమే రష్యాను బ్రెజిల్ అధిగమించింది. కానీ, త్వరలో అమెరికాను దాటిపోయే అవకాశం లేదు. ప్రపంచంలోని నంబర్ ఒకటి ఆర్థిక వ్యవస్థలో 1.5 మిలియన్లకు పైగా కేసులు ఉన్నాయి. వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి Bolsonaro ఇద్దరు ఆరోగ్య మంత్రులను కోల్పోయింది. క్లోరోక్విన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి మలేరియా నిరోధక ఔ షధాల ప్రారంభ వాడకాన్ని ప్రోత్సహించమని ఒత్తిడి చేసింది.
Read: తాకేది లేదు.. తొక్కడమే : మాల్ ఎలివేటర్లలో ఫుట్ పెడల్స్ బటన్లు