Chris Froggatt-Ileana: బ్రిటిష్ డ్రైవర్ ను పెళ్లి చేసుకున్న మలేసియా యువరాణి.. కౌలాలంపూర్‌లో రాయల్ వెడ్డింగ్.. పిక్స్ వైరల్
బ్రిటిష్ రేసింగ్ డ్రైవర్ క్రిస్ ఫ్రాగట్ మలేషియాకు చెందిన రాజకుమారి తెంగ్కు పుతేరి ఇలియానా(Chris Froggatt-Ileana) ఆలియాను వివాహం చేసుకున్నారు.
British racing driver Chris Froggatt married Malaysian Princess Ileana.
- రాజకుమారిని పెళ్లాడిన బ్రిటిష్ రేసర్.
- కౌలాలంపూర్‌లో రాయల్ వెడ్డింగ్ వేడుక.
- ఇస్లామిక్ సంప్రదాయంలో వివాహ తంత్రం.
Chris Froggatt-Ileana: బ్రిటిష్ రేసింగ్ డ్రైవర్ క్రిస్ ఫ్రాగట్ తన జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. మలేషియాకు చెందిన రాజకుమారి తెంగ్కు పుతేరి రాజా తెంగ్కు పుతేరి ఇలియానా ఆలియాను ఆయన వివాహం చేసుకున్నారు. కౌలాలంపూర్‌లోని షాగ్రీ-లా హోటల్లో ఆగస్ట్ 7న ఈ రాచరిక వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఇలియానా తండ్రి సుల్తాన్ అబ్దుల్లా రియాతుద్దీన్ అల్-ముస్తఫా బిల్లా షా.. పహాంగ్ సుల్తాన్‌గా ఉంటూనే, మలేషియాకు 16వ చక్రవర్తిగా ఐదేళ్ల పాటు సేవలు అందించారు.
Holidays: ఏపీ, టీజీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరోసారి వరుస సెలవులు వస్తున్నాయ్
సంప్రదాయ బద్ధంగా రాచరిక వివాహం:
మలేషియా, ఇస్లామిక్ రాచరిక సంప్రదాయాల ప్రకారం ఈ వివాహ తంత్రులను నిర్వహించారు. వివాహానికి ముందు క్రిస్ ఫ్రాగట్ (Chris Froggatt-Ileana)సున్నత్ ప్రార్థనలు చేయగా, అనంతరం వధూవరులు ఉంగరాలు మార్చుకుని ‘మస్ కహ్విన్’ అనే సాంప్రదాయ వివాహ కానుకను అందజేశారు. కొత్త జంటను ఆశీర్వదించే ‘మెరెంజిస్’ నీటి చల్లుడు వేడుకతో పాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ వేడుకలో పహాంగ్ సుల్తాన్‌తో పాటు పహాంగ్ యువరాజు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ షేక్ మహమ్మద్ బిన్ హమద్ తదితర ముఖ్య ప్రముఖులు పాల్గొన్నారు.
వధువు రాయల్ లుక్.. క్రిస్ రేసింగ్ ప్రయాణం:
ఈ పెళ్లి కోసం మలేషియా డిజైనర్ రద్జువాన్ రద్జివిల్ రూపకల్పన చేసిన దుస్తులను ఇలియానా ధరించగా, పహాంగ్ రాజకుటుంబానికి చెందిన ప్రతిష్టాత్మక ‘క్వీన్ అజీజా డైమండ్ టియారా’ను ఆమె ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక 32 ఏళ్ల క్రిస్ ఫ్రాగట్ విషయానికొస్తే.. ఆయన ప్రముఖ జీటీ ప్రపంచ ఛాలెంజ్ యూరప్ ఎండ్యూరెన్స్ కప్‌లలో పోటీపడే బ్రిటిష్ రేసర్. 24 ఏళ్ల వయసులో ఇటలీలోని ఫియోరానో ఫెరారీ టెస్ట్ ట్రాక్‌లో ఫెరారీ డ్రైవింగ్ అనుభవం పొందిన తర్వాత ఆయన ప్రొఫెషనల్ రేసింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు.
