పబ్ లో చోరీ చేయాలని అనుకున్నాడు..ఫుల్ గా మందు తాగాడు..సీన్ కట్ చేస్తే
- madhu
- Published On : January 31, 2021 / 03:42 PM IST
Burglar is found asleep inside pub : ఓ దొంగ పబ్ లో దొంగతనం చేయాలని అనుకున్నాడు. అనుకున్న విధంగానే..అక్కడకు చేరుకున్నాడు. క్యాష్ కౌంటర్లలో డబ్బు లేకపోవడంతో..మద్యం బాటిళ్లు చూసి ఆశ పడ్డాడు. ఫుల్ గా మందుకొట్టాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో అతనికే తెలియలేదు. బాటిళ్లను ధ్వంసం చేశాడు. తెల్లారి చూస్తే..అతనికి షాక్ కొట్టింది.
న్యూ క్యాస్టేలోని తవేరన్ అనే ప్రాంతంలో ఓ పబ్ ఉంది. అందులో చోరీ చేయాలని అనుకున్నాడు. పబ్ మూసేసిన తర్వాత..వెళ్లాడు. ఎలాగలో చొరబడ్డాడు. క్యాష్ కౌంటర్ దగ్గరకు వెళ్లి చూశాడు. అందులో ఓపెన్ చూసి చూడగా..చిల్లిగవ్వ కూడా లేదు. దీంతో అతడికి ఏం చేయాలో తోచలేదు. కళ్ల ముందు కాస్ట్లీ బాటిళ్లు కనబడడంతో ఆగలేకపోయాడు. గ్లాసులో పోసుకుని తాగేది తాగాడు.
తాగిన బాటిళ్లను పగులగొట్టాడు. పబ్ లో ఉన్న వస్తువులను సైతం ధ్వంసం చేశాడు. అలిసిపోయి..అక్కడనే ఉన్న సోఫాపై పడుకున్నాడు.
ఓనర్ డేవిడ్ కింగ్ వచ్చి పబ్ ఓపెన్ చేశాడు. లోపల ధ్వంస అయిన బాటిళ్లు, వస్తువులు కనిపించడంతో షాక్ తిన్నాడు. దొంగతనం అయ్యిందని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న పోలీసులకు గాఢ నిద్రలో పడుకున్న వ్యక్తి కనిపించాడు. దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అతడిని అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం చేసిన వ్యక్తి…మరియన్ పెట్రికాస్ గా తేలింది.
