అది అడవి సింహం అనుకుని భయపడ్డారు.. నిజం తెలిశాక నవ్వుకున్నారు..
- veegam team
- Published On : March 11, 2020 / 03:46 PM IST
ఒక్కోసారి పొరపాట్లు జరుగుతుంటాయి. మనం భ్రమలో పడుతుంటాం. ఆ తర్వాత పొరపాటు తెలుసుకుని ఆశ్చర్యానికి గురవుతాం. కొన్ని పొరపాట్లు చాలా ఫన్నీగా ఉంటాయి. స్పెయిన్ లో జరిగిన ఒక ఘటన నవ్వులు పూయించింది. రోడ్డు పై తిరుగుతున్న కుక్కను చూసి సింహం అని అంతా అనుకున్నారు. భయంతో గజగజ వణికారు. కట్ చేస్తే.. అది అడవి సింహం కాదు గ్రామ సింహం.. అదేనండి కుక్క అనే నిజం తెలిసి అవాక్కయ్యారు.
మార్చి 7న ఈ ఘటన జరిగింది. ఓ కుక్క బొచ్చు కత్తిరించి ఉంది. చూడ్డానికి అచ్చం సింహం లానే ఉంది. అది రోడ్లపై తిరగడం చూసి స్థానికులు భయపడ్డారు. అడవిలో ఉండాల్సిన సింహం రోడ్డుపైకి వచ్చిందని కంగారుపడ్డారు. భయంతో వణికిపోయారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపారు. కొందరు స్థానికులు అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసి చెప్పారు. వారు కూడా కంగారు పడ్డారు. సింహాన్ని బంధించేందుకు రంగంలోకి దిగారు. అన్ని ప్రాంతాలను జల్లెడ పట్టారు. స్థానికులు చెప్పినట్టే.. ఓ భారీ సైజులో ఉన్న జంతువు ఒకటి వారి కంట పడింది. అదే సింహం అని అంతా అనుకున్నారు. కట్ చేస్తే.. అది సింహం కాదు కుక్క అని తేలింది. దీంతో అధికారులు, స్థానికులు అవాక్కయ్యారు.
ఇంతకీ నిజం ఏంటంటే.. ఆ కుక్క యజమాని దాన్ని బొచ్చు కత్తిరించాడు. అది కూడా సగం మాత్రమే షేవింగ్ చేసి ఉంది. దీంతో అది సింహంలా కనిపించింది. కుక్కకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అది అడవి సింహం కాదు గ్రామ సింహం అని తెలిసి అంతా నవ్వుకున్నారు.
Se han recibido esta mañana varios avisos alertando de que habían visto suelto por la zona de huerta un león ?, otros un bicho extraño, pero finalmente le hemos pasado el lector de microchip y ha resultado ser un… perro ?. Identificando a su titular. pic.twitter.com/O5k6ZClX9a
— Policia Local Molina de Segura (@MolinaPolicia) March 7, 2020
— Policia Local Molina de Segura (@MolinaPolicia) March 7, 2020
