China Blocks India-US Move: ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు చైనా మరోసారి అడ్డుతగిలింది. పాక్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా నేత షాహిద్ మహ్మూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలంటూ అమెరికాతో కలిసి భారత్ చేసిన ప్రతిపాదన ముందుకు వెళ్లకుండా అడ్డుకుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇటువంటి ప్రతిపాదనలను చైనా పదే పదే అడ్డుకుంటోంది.
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులను ‘1267 అల్ ఖైదా ఆంక్షల కమిటీ’ గుర్తించకుండా గత ఆరు నెలల్లో చైనా అడ్డుకోవడం ఇది నాలుగోసారి. కాగా, 2016, డిసెంబరులోనే అమెరికా షాహిద్ మహ్మూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు వ్యతిరేకంగా, పాకిస్థాన్ కు అనుకూలంగా చైనా వ్యవహరిస్తోంది. గతంలోనూ భారత్ చేసిన ఎన్నో ప్రతిపాదనలను చైనా అడ్డుకుంది.
భారత్ పై కుట్రలు పన్నుతూ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న పాక్ కు చైనా సాయం చేస్తుండడం పట్ల ఇప్పటికే పలుసార్లు భారత్ అభ్యంతరాలు తెలిపింది. అయినప్పటికీ చైనా తన చర్యలను కొనసాగిస్తూ తన వైఖరిని బయటపెట్టుకుంటోంది.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..