×
Ad

China : చైనా ఇంజనీర్ల మరో అద్భుత ఆవిష్కరణ.. 2 గంటల ప్రయాణం.. 20 నిమిషాల్లో..!

China Sea Corridor : చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. షెన్‌జెన్ - జోంగ్‌షాన్ నగరాల మధ్య లింక్‌ను తాజాగా ప్రారంభించింది. 28కిలోమీటర్ల పొడవైన సముద్ర కారిడార్‌లో నీటి అడుగున 6.8 కిలోమీటర్ల పొడవైన సొరంగం ఉండటం దీని ప్రత్యేకత.

China Sea Corridor

  • చైనా ఇంజనీర్ల అద్భుత ఆవిష్కరణ
  • షెన్‌జెన్ – జోంగ్‌షాన్ లింక్ ప్రారంభం
  • నిర్మాణానికి 14ఏళ్ల సమయం
  • రెండు గంటల ప్రయాణం 20 నిమిషాల్లోనే..

China Sea Corridor : ఇంజనీరింగ్ అద్భుతాల ఆవిష్కరణలకు చైనా దేశం కేంద్ర బింధువుగా ఉన్న విషయం తెలిసిందే. అక్కడ ఇంజనీర్లు అద్భుత నిర్మాణాలతో ప్రపంచ దేశాలను ఆవిష్కరిస్తున్నారు. ఈ క్రమంలో చైనా మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించింది.

Also Read:  ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో 169 సార్లు దలైలామా పేరు? కీలక ప్రకటన చేసిన దలైలామా ఆఫీస్

మౌలికరంగ నిర్మాణాల్లో చైనా మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. షెన్‌జెన్ – జోంగ్‌షాన్ నగరాల మధ్య లింక్‌ను తాజాగా ప్రారంభించింది. 28కిలోమీటర్ల పొడవైన సముద్ర కారిడార్‌లో నీటి అడుగున 6.8 కిలోమీటర్ల పొడవైన సొరంగం ఉండటం దీని ప్రత్యేకత.

ఈ సముద్ర లిక్ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు రెండు గంటల నుంచి కేవలం 20 నిమిషాలకు తగ్గిస్తుంది. ఇది నీటి పైన ఎగురుతున్న ఒక పెద్ద పక్షిని లేదా సముద్రంపైన తేలియాడే గాలిపటాన్ని పోలి ఉంటుంది. గ్రేటర్ బే ఏరియాలో కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తుంది. సొరంగ విభాగాలు, అధునాతన వెంటిలేషన్, తుఫానులు, బలమైన అలలను తట్టుకునేలా రూపొందించబడిన ఈ లింక్ మౌలిక సదుపాయల ఆవిష్కరణకు కొత్త ప్రమాణాన్ని నిర్దేశిస్తుంది. బిగ్ డేటా, కృత్రిమ మేథ సహా వివిధ రకాల స్మార్ట్ టెక్నాలజీలను ఈ కనెక్టివిటీ కోసం చైనా ఇంజనీర్లు వినియోగించారు.

రోజువారి తనిఖీల కోసం సముద్ర గర్భ సొరంగాలలో స్మార్ట్ రోబోలను సిద్ధం చేశారు. దాదాపు 1,37,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దాదాపు 19 ఫుట్ బాల్ మైదానాల పరిమాణంలో ఈ కనెక్టివిటీ లింగ్డింగ్ యాంగ్ జలాల్లో ఏర్పాటైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 14ఏళ్లు పట్టింది. 15వేల మందికిపైగా కార్మికులు ఇందుకోసం పనిచేశారు. చైనా మౌలిక వసతుల రంగంలో సాధించిన మరో కీలక ఘట్టంగా ఈ సముద్ర లింక్ నిలుస్తోంది.