Robot Tiangong Ultra: రన్నింగ్ లో ఉసెన్ బోల్డ్ రికార్డు బ్రేక్ చేసిన రోబో.. అసలు దానికి రన్నింగ్ నేర్పాల్సిన పనేంటని మీకు డౌటొచ్చిందా.. ఇందుకే!

చైనాకు చెందిన 'తియాన్‌గాంగ్ ఆల్ట్రా(Robot Tiangong Ultra)' అనే హ్యూమనోయిడ్ రోబో 100 మీటర్ల పరుగును కేవలం 9.39 సెకన్లలోనే పూర్తి చేసి సంచలనం సృష్టించింది.

Chinese humanoid robot tiangong ultra breaks usain bolt 100m record

  • ఉసేన్ బోల్ట్ రికార్డు బ్రేక్
  • 9.39 సెకన్లలో 100 మీటర్లు
  • ఫిజికల్ ఏఐ రంగంలో చైనా

Robot Tiangong Ultra: బీజింగ్‌లో జరుగుతున్న ‘వరల్డ్ హ్యూమనోయిడ్ రోబో గేమ్స్’ పోటీలలో చైనాకు చెందిన ‘తియాన్‌గాంగ్ ఆల్ట్రా(Robot Tiangong Ultra)’ అనే హ్యూమనోయిడ్ రోబో 100 మీటర్ల పరుగును కేవలం 9.39 సెకన్లలోనే పూర్తి చేసి సంచలనం సృష్టించింది. 2009లో ఉసేన్ బోల్ట్ నెలకొల్పిన 9.58 సెకన్ల ప్రపంచ రికార్డు కంటే ఇది వేగవంతమైనది కావడం విశేషం. మరో రోబో ‘లైట్నింగ్’ కూడా 9.47 సెకన్లలో ఈ రేసును ముగించింది. కేవలం వినోదం కోసమే కాకుండా, మనుషుల రోజువారి సవాళ్లను ఎదుర్కొనేలా రోబోల శారీరక సామర్థ్యాన్ని (Physical AI) పెంపొందించడానికి ఈ తరహా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయి.

Onion Prices: ఉల్లి ధరలపై కేంద్రం గుడ్ న్యూస్.. నాసిక్ నుంచి ప్రత్యేక రైళ్లు.. సామాన్యులకు భారీ ఊరట

రోబోలకు వేగంగా పరుగెత్తడం ఎందుకు నేర్పుతున్నారు?

మనిషి శరీరం క్లిష్టమైన వాతావరణంలో బ్యాలెన్స్ తప్పుతున్నప్పుడు దాన్ని అధిగమించేందుకు మెదడు ద్వారా వెంటనే నిర్ణయాలు తీసుకుంటుంది. రోబోలు కూడా వేగంగా పరిగెడుతూ తమ బ్యాలెన్స్, వేగం, కదలికలను సమన్వయం చేసుకోవడం నేర్చుకోవడం వల్ల నిజ జీవితంలో సంక్లిష్టమైన పనులను తేలికగా చేయగలుగుతాయి. ఇటువంటి శారీరక నైపుణ్యం సాధించిన రోబోలు భవిష్యత్తులో ప్రమాదకరమైన శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడం, మంటల్లోకి వెళ్లి సహాయక చర్యలు చేపట్టడం, పరిశ్రమలలో క్లిష్టమైన పనులను సమర్థవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఫిజికల్ Ai దిశగా చైనా ముందడుగు:

రోబోటిక్స్ రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న చైనా, తన నూతన ఐదేళ్ల ప్రణాళికలో రోబోటిక్స్‌ను పారిశ్రామిక వ్యవస్థకు కీలక ప్రతిపాదికగా మార్చుతోంది. కేవలం సాఫ్ట్‌వేర్ ఆధారిత ఏఐకే పరిమితం కాకుండా, యంత్రాలకు శారీరక కదలికలు, నైపుణ్యాలను అందించే ‘ఫిజికల్ ఏఐ’ రంగంలో ఆర్థిక వృద్ధి సాధించడమే లక్ష్యంగా చైనా భారీ పెట్టుబడులు పెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న పారిశ్రామిక రోబోలలో సగానికి పైగా చైనాలోనే ఉండటం రోబోటిక్స్ సాధిస్తున్న విప్లవాత్మక పురోగతికి అద్దం పడుతోంది.