యూకేలో అధిక వర్షపాతానికి కోల్డ్‌ వార్ అణు పరీక్షలే ఎందుకు కారణమంటే?

  • Publish Date - May 14, 2020 / 03:45 AM IST

కోల్డ్ వార్.. ప్రచ్ఛన్న యుద్ధం.. (శీతల సమరం) అని దీనికి పేరు. ప్రచ్చన్న యుద్ధం సమయంలో పరీక్షించిన అణు బాంబులే 1960లో UKలో అత్యధిక స్థాయిలో వర్షపాతానికి కారణమని University of Reading తెలిపింది. అణు పరీక్షా విస్ఫోటనాల నుంచి విద్యుత్ ఉత్పత్తి కావడంతో ఈ వర్షపాతానికి దారితీసినట్టు పేర్కొంది. ప్రధానంగా యుఎస్ , సోవియట్ యూనియన్ 1950, 1960 లలో నిర్వహించిన అణు పరీక్షల ఎఫెక్ట్.. వాతావరణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్ సైంటిస్టుల ప్రకారం.. పరిశోధనా కేంద్రాల నుంచి వచ్చిన చారిత్రక రికార్డుల్లో ఆ రోజుల్లో గణనీయంగా ఎక్కువ వర్షపాతాన్ని సూచించాయి. ఇందులో ఎక్కువ రేడియోధార్మికత కూడా ఉంటుందని అధ్యయన ప్రధాన రచయిత ప్రొఫెసర్ Giles Harrison అన్నారు. 

ప్రచ్ఛన్న యుద్ధ ఆయుధ పరీక్షల నుండి విడుదలయ్యే రేడియోధార్మికతను అధ్యయనం చేయడం ద్వారా ఆ సమయంలో సైంటిస్టులు వాతావరణంలో కలిగిన మార్పులను తెలుసుకున్నారని తెలిపారు. వర్షపాతంపై ప్రభావాన్ని పరిశీలించడానికి ఇప్పుడు ఈ డేటాను తిరిగి ఉపయోగించామన్నారు. వాతావరణంలో విద్యుత్ ఛార్జ్ కారణంగా మేఘాలలో నీటి బిందువులు ఎలా ఢీకొనాలో ప్రభావితం చేస్తుంది. ఆ బిందువుల పరిమాణం బట్టి వర్షపాతాన్ని ప్రభావితం చేస్తుందని పరిశోధకులు ఊహించినట్టు తెలిపారు. ఏదేమైనా, వాతావరణంలో ఇలాంటి మార్పులు జరుగుతున్నట్లు గమనించడం చాలా కష్టమని పేర్కొన్నారు.

శాస్త్రవేత్తలు అణు పరీక్ష డేటాను వాతావరణ రికార్డులతో కలిపి పరిశోధించారు. ప్రచ్ఛన్న యుద్ధం అంతటా ప్రపంచంలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో అణు పరీక్షలు జరిగాయి. కానీ, రేడియోధార్మిక కాలుష్యం త్వరగా వాతావరణం అంతటా వ్యాపించింది. ఈ కాలుష్యం వల్ల వాతావరణంలోని అణువులు అయనీకరణం చెందడం లేదా విద్యుత్ చార్జ్ అయ్యాయి. షెట్లాండ్ దీవులలో స్కాట్లాండ్‌కు వాయువ్యంగా 300 మైళ్ళ దూరంలో సేకరించిన డేటాలో ఈ విషయం బయటపడింది. 

పశ్చిమ లండన్‌లోని క్యూలో తీసుకున్న వాతావరణ విద్యుత్ కొలతలతో అక్కడ వర్షపాతం కొలతలను సైంటిస్టులు పోల్చిచూశారు. UKలో అధిక లేదా తక్కువ విద్యుత్ ఛార్జ్ ఉత్పత్తి అయిన దాదాపు 150 రోజులలో షెట్లాండ్‌లో వర్షపాతం తేడాలను చూపించింది. ఫిజికల్ రివ్యూ లెటర్స్ పత్రికలో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. కాలుష్యానికి దూరంగా షెట్లాండ్ దీవులలో రోజువారీ వర్షపాతంలో గణనీయమైన మార్పులు సంభవించాయి. అణు ఆయుధాల పరీక్ష వ్యవధిలో రోజువారీ వర్షపాతం 24శాతం మారిపోయింది. మేఘం గాజులాగా చిక్కగా ఉందని వారు కనిపెట్టారు. అణు పేలుళ్ల వల్ల విద్యుత్ ఉత్పత్తి అయి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయని గుర్తించారు.