ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తితో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా సంక్షోభంతో అప్పటివరకూ నడిచిన వ్యాపారాలు, కార్యకలాపాలన్నీ ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరిస్తున్నాయి. కరోనా ప్రభావంతో ప్రపంచమంతా తమ వ్యాపార కార్యకపాల కోసం కొత్త మార్గాలను అన్వేషించుకుంటున్నాయి. ఇప్పుడు కరోనా మహమ్మారి బ్రిటన్ దేశీయులను తమ సాంప్రదాయక పార్లమెంట్లకు భిన్నంగా మార్చుకునేలా ప్రేరేపించింది. చెక్క మౌలిక సదుపాయాలతో నిండిన బ్రిటన్ పార్లమెంట్ ఇప్పుడు మోడ్రాన్ వీడియో కాన్ఫరెన్స్ హబ్‌గా మారిపోయింది. బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ డిబేటింగ్ చాంబర్ 600 ఏళ్ల నుంచి ఇప్పటివరకూ ఒకే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చింది. వుడెన్ ఫర్నిచర్, ట్రేడేషనల్ లుక్‌తో కనిపిస్తుండేది.
ఇప్పుడు బ్రిటన్‌లో కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా 34వేల మంది మరణించారు. కరోనా సమయంలో బ్రిటన్ పార్లమెంట్ అత్యాధునికంగా మార్చేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు పార్లమెంటులోని పాత ఇంటిరియర్ తో కూడిన డిబేటింగ్ చాంబర్‌ను మోడ్రాన్ సెంటర్ గా మార్చేయాలని ఆదేశించింది. అధికారులతో వర్చువల్ గా కనెక్ట్ అయ్యేలా ఈ వీడియో కాన్ఫరెన్స్ హబ్‌ను ఏర్పాటు చేసింది. చూడటానికి ఒక పెద్ద టీవీ స్టూడియో మాదిరిగా ఉందని పార్లమెంటులో ఓ సీనియర్ అధికారి Matthew Hamlyn చెప్పారు.
వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ చాంబర్ మొత్తాన్ని కేవలం రెండు వారాల్లోనే మోడ్రాన్ హబ్‌గా మార్చేసింది. ఏప్రిల్ 22న దీనికి సంబంధించి ప్రక్రియ ముగిసింది. అంతేకాదు.. ఇటీవలే పార్లమెంటులోని ఈ మోడ్రాన్ వీడియో కాన్ఫరెన్స్ హబ్ నుంచి తొలిసారిగా రిమోట్ ఓటింగ్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా పార్లమెంటరీ సభ్యులంతా వీడియో కాన్ఫరెన్స్ కాల్ ద్వారా ఓటింగ్ లో పాల్గొన్నారు.
Read: వ్యాక్సిన్ లేకుండానే కరోనాను ఖతం చేసే కొత్త డ్రగ్