బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఇంటెన్సివ్ కేర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో నిత్యం ప్రాణాలతో పోరాడుతున్నారని అధికారులు తెలిపారు. విదేశాంగ సెక్రటరీ డామినిక్ రాబ్ మాత్రమే ప్రధాని పర్యవేక్షణలు చూస్తున్నారు. లండన్‌లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా లక్షణాలు కనిపించడంతో మార్చి 27 నుంచి జాన్సన్ సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు.
ఆదివారం రాత్రి కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే రోజు ఆయన ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని ఆరోగ్య పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. బోరిస్ తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు. బోరిస్‌కు మంచి వైద్యం అందేలా డాక్టర్లు పర్యవేక్షించాలన్నారు. ప్రధాని ఆరోగ్యం విషమం కావడంతో బ్రిటన్ వాసుల్లో ఆందోళన మొదలైంది.
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. మాట్లాడుతూ.. ప్రపంచ దేశాల నాయకులంతా జాన్సన్ కోలుకోవాలని ప్రార్థిస్తున్నారని అన్నారు. అమెరికాలో మహమ్మారిని అదుపుచేయలేక గందరగోళ వాతావరణం నెలకొంది. ట్రంప్ మళ్లీ మాట్లాడుతూ.. దారులు అన్నీ మూసుకుపోయినా ఒక్కటి ఉంటుంది. సంక్షోభం నుంచి బయటపడాలి. వృద్ధి రేటు పడిపోతుండటంతో ఆయన ఈ విధంగా మాట్లాడారు.
రాబోయే రోజుల్లో అమెరికన్లలో మరిన్ని కేసులు నమోదయ్యే ప్రమాదముంది. అక్కడి సర్జన్ ఒకరు మాట్లాడుతూ.. ఇది చాలా విచారకరమైన వారం. అమెరికన్ల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఇది పెరల్ హార్బర్ మూమెంట్ లాంటిది లేదా 9/11 వంటిది’ అంటూ పోల్చారు. న్యూయార్క్ గవర్నర్ షట్ డౌన్ ను పొడిగిస్తూ ఇది తప్ప ప్రత్యామ్నాయం లేదు.. ఇది రిలాక్స్ అయ్యే టైం కాదని అన్నారు. (కేరళ వినూత్న ప్రయత్నం : కరోనా కియోస్క్.. అంటే ఏమిటి)