అంటార్కిటికాలో ఫస్ట్ టైం రికార్డు స్థాయిలో కరోనా కేసులు

  • Published On : December 23, 2020 / 07:59 AM IST

Covid Cases Recorded Antarctica For First Time : ప్రపంచమంతా కరోనావైరస్‌తో అల్లకల్లోలమైపోతుంటే.. ఏకైక ఖండం అంటార్కిటికా మాత్రం కరోనా బారినపడలేదు. కానీ, ఇప్పుడు అంటార్కిటికా ఖండంలోనూ మొదటిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. 36 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. చిలీ రీసెర్చ్ బేస్ సహా చిలీ ఆర్మీలోని 26 మంది సభ్యులు, 10 మంది నిర్వాహణ వర్కర్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని స్పానిష్ మీడియా నివేదించింది.

సకాలంలో నివారణ చర్యలు చేపట్టినట్టు చిలీ ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది. వెంటనే పిసిఆర్ పరీక్షలు చేయడంతో వైరస్ నియంత్రణకు సాధ్యపడిందని తెలిపింది. రీసెర్చ్‌ బేస్‌కు వచ్చిన ఓడలో ముగ్గురు సిబ్బందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని నివేదించింది. పాజిటివ్ వచ్చిన 36 మందిని చిలీలోని పుంటా అరేనాస్ నగరానికి తరలించారు. ఐసోలేషన్ లో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగానే ఉందని నివేదించింది.

ఈ ద్వీపంలోని 13 చిలీ స్థావరాలలో ఇదొకటి. కొత్త కరోనా కేసులు నమోదుకావడంతో అంటార్కిటిక్‌లోని అన్ని ప్రధాన పరిశోధన ప్రాజెక్టులను నిలిపివేశారు. ఫలితంగా, ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల పరిశోధనలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఖండంలో శాశ్వత నివాసితులు లేరు.. 1,000 మంది పరిశోధకులు, ఇతర సందర్శకులు మాత్రమే ఈ ద్వీపంలో ఉన్నారని స్పానిష్ మీడియా తెలిపింది.

మార్చిలో, కోవిడ్ వ్యాప్తితో ప్రపంచమంతా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. అంటార్కిటిక్‌లో మహమ్మారి ఒక పెద్ద విపత్తుగా మారే ప్రమాదం ఉందంటున్నారు. బలమైన గాలులు అతి శీతల ఉష్ణోగ్రతలతో, ఖండంలో ఇప్పటికే ప్రమాదకరంగా మారింది.  అంటార్కిటికా కఠినమైన వాతావరణంలో గణనీయమైన మరణాలు నమోదయ్యాయి.