‘వెర్రి ట్రంప్.. అంతా అయిపోయిందనుకోవద్దు’

ఇరాన్ మిలిటరీ కమాండర్‌ ఖాసిం సులేమానీ హత్య తర్వాత నుంచి ట్రంప్‌పై మాటల దాడులు పెరిగిపోయాయి. యూఎస్ డ్రోన్ స్ట్రైక్ జరిపించి సులేమానీని మట్టుబెట్టాడు ట్రంప్. ఈ ఘటన అమెరికాకు ఓ డార్క్ డేను తెచ్చిపెడుతుందని సులేమానీ కూతురు హెచ్చరిస్తుంది. 

వెర్రి ట్రంప్. మా నాన్న ప్రాణాలు తీసి అంతా అయిపోయిందనుకోవద్దని ఖాసిం సులేమానీ కూతురు జీనబ్ సులేమానీ ఓ ప్రాంతీయ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం.. దాడి చేయమంటూ ఆదేశాలివ్వడంతో జనరల్ ను హతమార్చాయి అమెరికా దళాలు. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అప్పుడే చెప్పింది. 

దీనికి ట్రంప్ కూడా అదే రీతిలో స్పందించి.. అమెరికాపై దాడి జరిగితే ఇరాన్ లోని 52 ప్రాంతాలపై దాడి చేస్తామంటూ.. వాటిలో సంప్రదాయంగా భావించే స్థలాలను కూడా నాశనం చేస్తానని కౌంటర్ ఇచ్చాడు. అమెరికా ప్రభుత్వ ఆస్తులను, అమెరికన్లకు ఏదైనా హాని జరిగితే సంక్షోభంలో పడిపోతామనే భయం ట్రంప్ లోనూ కనిపిస్తుంది. 

బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో శుక్రవారం(జనవరి-3,2020) కారులో వెళ్తున్న టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమ‌నిపై అమెరికా ద‌ళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమ‌ని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్‌లో సోమవారం(జనవరి-6,2020) సోలెమని శ‌వ‌యాత్ర చేప‌ట్టారు. లక్షల సంఖ్యలో ప్రజలు,సోలేమని అభిమానులు ఈ  అంతిమ‌యాత్ర‌లో పాల్గొన్నారు. ఇరాన్ సుప్రీం నేత అయ‌తుల్లా  అలీ ఖ‌మేనీ .. సులేమానీ కూడా అంతిమ‌యాత్ర‌లో పాల్గొన్నారు.