Hassanal Bolkiah : ఈయన ఇంటి ముందు అంబానీ ఇల్లు జుజూబీ..

Brunei Sultan : బ్రూనై ప్రస్తుత రాజు హసనల్ బోల్కియా. ఆయనకు విలాసపురుషుడిగా ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. బ్రూనై సుల్తాన్‌ ఉండే భవనం పెద్ద కోటను తలపిస్తుంది. ఇందులో గదులు, బాత్ రూమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్ ఇలా అనేక సదుపాయాలు కుప్పలుతెప్పలుగా ఉంటాయి. ఇక సుల్తాన్ ప్యాలెస్‌లో కార్ల గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

Hassanal Bolkiah

Hassanal Bolkiah : ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ నివాసం అయిన ఆంటిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. ఈ భవనంలో ఉండే సదుపాయాలన్ని కూడా ఆసక్తికరంగానే ఉంటాయి. ఇది ముంబైలోని అల్టా‌మౌంట్ రోడ్డులో ఉంది. అయితే, అంబాని ఇంధ్రభవనాన్ని తలదన్నేలా బ్రూనై సుల్తాన్ రాజభవనం ఉంటుంది. అంబానీ ఇంటి కంటే ఐదు రెట్లు పెద్ద భవనం ఇది.

Also Read : Gold Silver Prices : బంగారం ధరలపై ఆర్బీఐ షాకింగ్ న్యూస్.. వామ్మో అంత పెరుగుతాయా..? ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..

బ్రూనై ఆగ్నేయాసిలో ఒక చిన్న దేశం. దక్షిణ చైనా సముద్రంలోని బోర్నియో ద్వీపం యొక్క ఉత్తర తీరంలో ఉన్న బ్రూనై.. ప్రపంచంలోనే అతిచిన్న దేశం అయినప్పటికీ అత్యంత సంపన్న దేశాల్లో ఒకటి. ఇక్కడ ఐదు లక్షల మందికంటే తక్కువగానే జనాభా ఉంటుంది. బ్రూనై ప్రస్తుత రాజు హసనల్ బోల్కియా. ఆయనకు విలాసపురుషుడిగా ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. బ్రూనై సుల్తాన్‌ ఉండే భవనం పెద్ద కోటను తలపిస్తుంది. ఇందులో గదులు, బాత్ రూమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్ ఇలా అనేక సదుపాయాలు కుప్పలుతెప్పలుగా ఉంటాయి. ఇక సుల్తాన్ ప్యాలెస్‌లో కార్ల గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

ముంబైలోని అంబాని ఆంటిలియా ఇంటితో పోలిస్తే ఇక్కడి భవనం ఐదు రెట్లు పెద్దది. అంబానీ అంటిలియా నాలుగు లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం అయితే.. సుల్తాన్ ప్యాలెస్ 20 లక్షల చదరపు అడుగులకుపైగా ఉంది. ఈ భవనంలో దాదాపు 1800 గదులు ఉన్నాయి. 275 స్నానాల గదులు, 5వేల మందికి సరిపోయే విశాలమైన డైనింగ్ హాల్ ఉంది. ఇక ఈ భవనంలో ఐదు స్విమ్మింగ్ పూల్‌లు నిర్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌గా దీని పేరిట గిన్నిస్‌ రికార్డు ఉంది. 1984లోనే దీని నిర్మాణానికి 1.4 బిలియన్‌ డాలర్లు ఖర్చుచేశారు.

సుల్తాన్ ప్యాలెస్‌లో లగ్జరీ కార్లకు కొదవేలేదు. ఈ ప్యాలెస్‌లో 100 గ్యాకేజీలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 7వేల లగ్జరీ కార్లు ఉంటాయి. వీటి విలువ ఐదు బిలియన్ డాలర్లకు పైనే. వాటిలో ప్రపంచంలో మరెవరీ వద్ద లేనంతగా.. 600 రోల్స్‌రాయిస్ కార్లతో అరుదైన రికార్డు సృష్టించారు. 450 ఫెరారీ, 380 బెంట్లీ కార్లు కూడా ఆయన కలెక్షన్ లో ఉన్నాయి. జాగ్వార్, ఫోర్స్, లంబోర్గిని, బీఎండబ్ల్యూ వంటి వాహనాలు కూడా ఉన్నాయి. వీటిల్లో బంగారం పూత పూసిన రోల్స్ రాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రపంచంలో ఉన్న ఏడు ఫెరారీ 456 జీటీ వెన్సీలో ఒకటి సుల్తాన్ వద్ద ఉంది.