US citizenship : గ్రీన్‌కార్డ్ హోల్డర్లకు బిగ్‌షాక్..! ట్రంప్ ప్రభుత్వం కీలక ప్రతిపాదన..

US citizenship : అమెరికా పౌరసత్వం (citizenship) పొందడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పౌరసత్వ దరఖాస్తు ఫీజులను భారీగా పెంచే ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది.

Trump admin could make US citizenship 75Percentage more expensive

US citizenship : అమెరికా పౌరసత్వం (citizenship) పొందడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పౌరసత్వ దరఖాస్తు ఫీజులను భారీగా పెంచే ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే అమెరికా పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది వలసదారులు, ముఖ్యంగా భారతీయులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

Also Read : Tamil Nadu CM Vijay : అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక ప్రసంగం.. ఆ మూడు అంశాలపై ప్రస్తావన.. వాళ్లను వదిలిపెట్టనంటూ వార్నింగ్

ప్రస్తుతం అమెరికా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునేవారు చెల్లించే ఫీజును 75శాతం వరకు పెంచాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) ప్రతిపాదించింది. దీంతో ప్రస్తుతం ఉన్న ఫీజు 760 డాలర్లు కాగా.. అదనంగా సుమారు 570 డాలర్లు పెరగనుంది. దీంతో మొత్తం 1330 డాలర్లు (రూ.1,13,050) వరకు చెల్లించాల్సి రావచ్చునని నివేదికలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా, ప్రస్తుతం తక్కువ ఆదాయం ఉన్న వలసదారులకు అందిస్తున్న ఫీజు మినహాయింపులు (Fee Waivers) కూడా నిలిపివేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో తక్కువ ఆదాయం కలిగిన గ్రీన్ కార్డ్ హోల్డర్లపై అదనపు ఆర్థిక భారంపడే అవకాశం ఉంది.

అయితే, తాజాగా ప్రతిపాదనలు తక్షణమే అమల్లోకి రావు. ఈ ముసాయిదాపై ప్రజలు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలియజేయడానికి 60రోజుల సమయం ఉంటుంది. ఆ తరువాతే తుది నిర్ణయాన్ని ట్రంప్ సర్కార్ ప్రకటిస్తుంది.

ఇటీవల ట్రంప్ ప్రభుత్వం అమెరికా వలస విధానాలను మరింత కఠినతరం చేస్తోంది. గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు అమెరికా వెలుపల నుంచే దరఖాస్తు చేయాలనే కొత్త నిబంధనలు, వీసా పరిశీలనలో కఠిన చర్యలు వంటి నిర్ణయాలు ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి. తాజా ఫీజుల పెంపు ప్రతిపాదన మరింత ఆందోళనలోకి నెట్టింది. తరతరాలుగా వలసలను ప్రోత్సహించిన అమెరికా, ఇప్పుడు దానికి భిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తోందని నిపుణులు విమర్శిస్తున్నారు.