Iran vs Israel War : యుద్ధంపై ట్రంప్ సంచలన నిర్ణయం.. ఇరాన్‌పై దాడులకు బ్రేక్! హర్ముజ్ జలసంధికి లైన్ క్లియర్!

Iran vs Israel War : ట్రంప్ సోషల్ ట్రూత్ లో పోస్టు ప్రకారం.. పాకిస్థాన్ ప్రధాని షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌తో మాట్లాడాను. ఇరాన్‌కు ఇచ్చిన గడువును రెండు వారాలపాటు పొడిగించాలని, దాడులను నిలిపివేయాలని కోరారు.

Iran vs Israel War

  • యుద్ధంపై ట్రంప్ సంచలన నిర్ణయం
  • ఇరాన్‌పై దాడులకు అమెరికా బ్రేక్
  • ఇరాన్‌పై సైనిక చర్య రెండు వారాలకు వాయిదా
  • హర్ముజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ అంగీకారం

Iran vs Israel War : ఇరాన్ వర్సెస్ అమెరికా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని గంటల్లో ఇరాన్‌ను నాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. కొద్దిగంటలకే వెనక్కు తగ్గాడు. ఇరాన్‌పై దాడిని తాత్కాలికంగా విరమించుకున్నట్లు తన ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ వెల్లడించారు.

Also Read : Donald Trump: ఈ రాత్రికే ఇరాన్ అంతం..! ట్రంప్ మరో డెడ్లీ వార్నింగ్

ఇరాన్‌పై సైనిక చర్యను రెండు వారాలు వాయిదా వేస్తున్నట్లు చెప్పిన ట్రంప్.. ఇదే క్రమంలో చర్చలకు మొగ్గు చూపారు. లెక్క ప్రకారం.. ఇరాన్ హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలని బుధవారం ఉదయం వరకు అమెరికా గడువు విధించింది. లేదంటే దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇదేక్రమంలో పాకిస్థాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ ట్రంప్‌ను ప్రాధేయపడుతూ ట్వీట్ చేశారు. ఇరాన్‌కి విధించిన గడువుని రెండు వారాలు పొడిగించాలని కోరుతున్నాను. ఇరాన్ కూడా హోర్మూజ్ జలసంధిని రెండు వారాలపాటు తెరవాలి. అదే సమయంలో అన్ని పక్షాలు కాల్పుల విరమణ ప్రకటించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను అని షెబాజ్ షరీఫ్ రాసుకొచ్చారు.

 

ట్రంప్ సోషల్ ట్రూత్‌లో పోస్టు ప్రకారం.. పాకిస్థాన్ ప్రధాని షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌తో మాట్లాడాను. ఇరాన్‌కు ఇచ్చిన గడువును రెండు వారాలపాటు పొడిగించాలని, దాడులను నిలిపివేయాలని కోరారు. హర్మూజ్ జలసంధిని తెరవాలనే షరతుకు లోబడి రెండు వారాల గడువు ఇచ్చేందుకు, కాల్పుల విరమణకు అంగీకరించాను. ఇరుదేశాల వైపు నుంచి ఈ కాల్పుల విరమణ ఉంటుంది. ఇరాన్ పది సూత్రాలతో ఒక ప్రతిపాదనను పంపించింది. అవన్నీ సానుకూలంగానే ఉన్నాయి. దీంతో చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. ఇరాన్‌తో శాశ్వత శాంతి ఒప్పందానికి పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి ఈ రెండు వారాల గడువు ఉపయోగపడుతుందని ట్రంప్ పేర్కొన్నారు.

మరోవైపు.. అమెరికా అంగీకరించిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ సమ్మతించింది. పాకిస్థాన్ ప్రధాని షానాబ్ షరీఫ్ అభ్యర్థన మేరకు అమెరికాతో చర్చలకు అంగీకరిస్తున్నామని వెల్లడించింది. సాయుధ దళాల పర్యవేక్షణలో రెండు వారాలపాటు హర్మూజ్‌లో రాకపోకలు సాగుతాయని పేర్కొన్న ఇరాన్.. ఈ విరామం కేవలం దౌత్యపరమైన చర్చల కోసమేనని, యుద్ధం శాశ్వతంగా ముగిసినట్లు కాదని ఇరాన్‌ స్పష్టం చేసింది.