Donald Trump Tariffs: ట్రంప్ కీలక నిర్ణయం.. భారత్‌లో ఆ పరికరాల తయారీ రంగానికి గుడ్‌న్యూస్.. తగ్గనున్న ధరలు
Donald Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పలురకాల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పరికరాలపై దిగుమతి సుంకాలను 10శాతం తగ్గించినట్లు ప్రకటించారు.
- Harish Thanniru
- Updated on- June 2, 2026 / 12:29 PM IST
Donald Trump Eases Tariffs Cut To 15 Percent Until Dec 2027
- డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం
- పరికరాల తయారీ రంగానికి శుభవార్త
- వాటిపై విధించిన టారిఫ్‌లను 25% నుంచి 15%కు తగ్గింపు
Donald Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు రకాల వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు చెందిన పరికరాలపై దిగుమతి సుంకాలను (Tariffs) 10శాతం తగ్గించినట్లు ప్రకటించారు. ఈ తగ్గింపుతో సుంకాలు 25శాతం నుంచి 15శాతానికి తగ్గనున్నాయి. వచ్చే ఏడాది చివరి వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది. అమెరికా వ్యవసాయ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం, ఉత్పత్తి దారుల వ్యయాలను తగ్గించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ యంత్రాంగం తెలిపింది. సవరించిన సుంకాల విధానం ఈనెల 8వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.
Also Read – Divvala Madhuri : తెలంగాణ రాజకీయాల్లోకి దివ్వల మాధురి.. పోటీ చేస్తాను అంటూ..
ట్రంప్ ప్రభుత్వం ఇటీవల ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై టారిఫ్‌లను 50శాతం వరకు పెంచింది. దీంతో అమెరికాలో తయారీ ఖర్చులు పెరిగి రైతులు, నిర్మాణ రంగం, పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం ఆ ప్రభావాన్ని కొంత వరకు తగ్గించేందుకు ఈ సడలింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. ట్రంప్ నిర్ణయం ప్రకారం.. వ్యవసాయ యంత్రాలు, హార్వెస్టర్లు, బుల్ డోజర్లు, ఫోర్క్ లిఫ్ట్‌లు, హెచ్‌వీఏసీ పరికరాలపై ఉన్న 25శాతం టారిఫ్‌ను 15శాతంకు తగ్గించారు.
విదేశీ తయారీ సంస్థలు ఏవైనా మూలధన పరికరాలను దిగుమతి చేసుకుంటే.. వాటి బరువులో 85శాతం అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న స్టీల్, అల్యూమినియం వంటివి వినియోగిస్తే 10శాతం సుంకం మాత్రమే వర్తిస్తుంది. అయితే, ట్రంప్ తాజా నిర్ణయం వల్ల భారత పరిశ్రమలకు కొంత మేరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
