పాశ్చాత్య దేశాల్లో ప్రేయసీ..ప్రియుల మధ్య ముచ్చట్లు ఎలా ఉన్నా..ముద్దులు కామన్.
పాశ్చాత్య దేశాల్లో ప్రేయసీ..ప్రియుల మధ్య ముచ్చట్లు ఎలా ఉన్నా..ముద్దులు కామన్. ఈ క్రమంలో ప్రేయసికి ముద్దు పెడతానంటు మారాం చేశాడు ప్రియుడు. కానీ ఆమెవద్దంది. కానీ అతను వినలేదు..ఎలాగైనా సరే ముద్దు పెట్టాల్సిందేననుకున్నాడు. అంతేకాదు లవర్స్ ను మార్చివేయటం..వాళ్లు మళ్లీ కలుసుకోవటం లవర్స్ లా ఉండటం మామూలే. కానీ మాజీ ప్రియురాలిపై కోపమొచ్చి ముద్దు పెట్టుకుంటానని ఆమెను అతి కిరాతకంగా గాయపరిచాడు ఓ యువకుడు. దీంతో అతడికి కోర్టు 12 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆ కథాకమామీషు ఏంటో తెలుసుకుందాం..
Read Also : మాయ చేయొద్దు : మోడీ మూవీకి ఈసీ బ్రేక్
అమెరికాలో సెథ్ ఆరన్ అనే యువకుడితో గ్రీన్‌విల్లేకు చెందిన కైలా అనే యువతి 2016లో డేటింగ్ చేసింది. సంవత్సరానికల్లా ఇద్దరికీ మనస్పర్థలు వచ్చి కైలా సెధ్‌కు దూరంగా ఉంటోంది. ఓ రోజు కైలాను కలవడానికి వచ్చిన సెథ్ గ్రీటింగ్ కార్డు ఇచ్చాడు. ఇద్దరం కలిసి ఉందామని కోరాడు. కానీ కైలా ఒప్పుకోలేదు ఇంకెప్పుడు తనను కలవొద్దని తెగేసి చెప్పేసింది. దీంతో సేథ్ అహం దెబ్బతింది. కైలాకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలని అనుకున్నాడు.
సెథ్ కైలాను ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు. వెంటనే పక్కకు తోసేసింది. కైలాను గట్టిగా పట్టుకుని ఆమె పెదవుల కింద గట్టిగా కొరికేసి గాయం చేశాడు. దాంతో ఆమె పెనుగులాడటంతో అది కాస్తా పెద్దగా అయిపోయి విపరీతంగా గాయమైంది. దీంతో ఆమె ఆస్పత్రికి వెళితే డాక్టర్లు సర్జరీ చేయగా కైలాకు 300 కుట్లు పడ్డాయి. ఈ ఘటనపై కైలా పోలీస్ ఫిర్యాదు చేయగా సేథ్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచగా సేథ్ నేరం అంగీకరించాడు. దీంతో న్యాయస్థానం సేథ్ కు 12 సంవత్సరాల జైలు శిక్షను విధించింది.
ఆ గాయం నుంచి బయట పడటానికి సంవత్సరం పట్టింది కైలాకు.సెథ్ లాంటి వ్యక్తిని చూశాక వేరొకరిని ప్రేమించాలంటేనే భయం వేసిందని..కానీ బ్లేక్ అనే వ్యక్తి తన జీవితంలోకి వచ్చాక తన జీవితం సంతోషంగా మారిపోయిందని కైలా ఆనందంగా చెబుతోంది.
Read Also : వెంటనే అందరికీ చెప్పండి : హైదరాబాద్ నుంచి ఏపీకి మూడు ప్రత్యేక రైళ్లు