కూతురి చదువు కోసం రోజూ 12కి.మీల ప్రయాణం

రోజువారీ జీవితంలో జరిగే ఘటన అయినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరి మన్ననలు అందుకుంటుంది ఈ ఘటన. తన కూతుళ్ల చదువు కోసం 12కిలోమీటర్లు ప్రయాణించి స్కూల్‌కు తీసుకెళ్తున్నాడు. ఇలా స్కూల్ కు తీసుకెళ్లి వాళ్లను దింపడమే కాకుండా స్కూల్ వదిలే సమయం వరకూ అక్కడే వేచి ఉంటాడు. అఫ్ఘనిస్తాన్‌లోని షరానా గ్రామంలో ఉంటున్న మియా ఖాన్‌కు నెటిజన్ల తమ గౌరవ వందనం అందజేస్తున్నారు. 

అఫ్గనిస్తాన్ లో స్వేడిష్ కమిటీ నిర్వహిస్తున్న నూరానియా స్కూల్‌కు ముగ్గురు కూతుళ్లను తీసుకెళ్తాడు. తన కూతుళ్లని డాక్టర్ చేయాలని కోరికతోనే చదివిస్తున్నట్లు ఆయన చెబుతున్నాడు. ‘నేను నిరక్షరాస్యుడ్ని. రోజువారీ కూలీగా బతుకుతున్నా. కానీ, నా కూతుళ్ల చదువు చాలా ముఖ్యం. మా ప్రాంతంలో డాక్టర్లు లేరు. నా కొడుకుల్లానే కూతుళ్లను విద్యావంతులను చేయడమే నా లక్ష్యం’  అని వివరించాడు. 

తమ స్కూల్ లో చదవుతున్న విద్యార్థుల గురించి స్వేడిష్ కమిటీ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. అంతే ఇలాంటి తండ్రులను తప్పక గౌరవించాలి. వారిని చూస్తే గర్వంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. వారి ఇష్ట ప్రకారం తండ్రి చదివిస్తున్నందుకు బాలికలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

‘ఈ సంవత్సరం నేను ఆరో తరగతి చదువుతున్నాను. రోజూ మా నాన్న లేదా అన్న ఎవరో ఒకరు మోటార్ సైకిల్ పై మమ్మల్ని స్కూల్ కు తీసుకొస్తారు. స్కూల్ పూర్తయ్యేంత వరకూ ఇక్కడే ఉండి ఇంటికి తీసుకెళ్తారు’ అని ఆ ముగ్గురిలో ఒకరైన రోజీ వెల్లడించింది.