పాకిస్థాన్‌లోని క్వెట్టా రైల్వే స్టేషన్‌లో శనివారం భారీ పేలుడు సంభవించి 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 46 మంది గాయపడినట్లు క్వెట్టా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆపరేషన్స్ మహ్మద్ బలోచ్ మీడియాకు చెప్పారు.
దీన్ని ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నట్లు తెలిపారు. పేలుడు జరిగిన చోటును నిపుణులు పరిశీలిస్తున్నారని చెప్పారు. పేలుడు జరిగిన సమయంలో ఘటనాస్థలి వద్ద దాదాపు 100 మంది ఉన్నారని తెలిపారు. రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాంలో పేలుడు సంభవించిందని అధికారులు చెప్పారు.
ఘటనాస్థలికి పోలీసులు, భద్రతా బలగాలు చేరుకున్నాయని బలూచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రింద్ ఒక ప్రకటనలో తెలిపారు. బాంబు నిర్వీర్యదళం అక్కడ ఆధారాలు సేకరిస్తోందని, ఘటనపై నివేదిక కోరామని అధికారులు చెప్పారు.
అక్కడి ఆసుపత్రులలో ఎమర్జెన్సీ ప్రకటించామని తెలిపారు. గాయపడిన వారికి వైద్య సాయం అందుతోందని చెప్పారు. పేలుడు జరిగిన సమయంలో ప్లాట్‌ఫాం నుంచి పెషావర్‌కు బయలుదేరడానికి రైలు సిద్ధంగా ఉంది. పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో మాదక ద్రవ్యాలు పెనుముప్పుగా మారాయి: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ట్వీట్