Donald Trump: మంగళవారం నేను అరెస్ట్ అవుతా.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ఈ సంబంధం గురించి సదరు పోర్న్ స్టారే కోర్టుకెక్కడం గమనార్హం. ట్రంప్‭తో తనకు శారీరక సంబంధం ఉందని, తమ మధ్య జరిగిన నాన్ డిస్‭క్లోజర్ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ లాస్ ఏంజెల్స్‭లోని కోర్టులో ఆమె దావా వేసింది. అయితే ఈ కేసులో ట్రంప్ మీద కేసు మోపాలా లేదా అని ప్రాసిక్యూటర్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం. కానీ ఈలోపే ఆయన అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే నేరారోపణలు ఎదుర్కొన్న మొదటి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రకెక్కుతారు.

Former President Donald Trump says he’ll be arrested on Tuesday

Donald Trump: ఒక పోర్న్ స్టార్‭కు భారీగా నగదు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తన అరెస్ట్ గురించి, అది ఎప్పుడు జరుగుతుందని ట్రంపే స్వయంగా ప్రకటించడం గమనార్హం. ఈ మంగళవారం తాను అరెస్ట్ అవుతానని ట్రంప్ అన్నారు. ఈ అరెస్ట్‭కు సంబంధించి మాన్ హట్టన్ జిల్లా అటార్నీ కార్యాలయం నుంచి స్పష్టమైన సంకేతాలు అందినట్లు ఆయన వెల్లడించారు.

Bengaluru-Mysuru Highway: ప్రారంభించి 6 రోజులు కాలేదు, అప్పుడే చెరువును తలపిస్తున్న ఎక్స్‭ప్రెస్‭వే.. ప్రధానిపై విమర్శలు

2016 ఎన్నికలకు ముందు ఒక పోర్న్ స్టార్‭కు భారీగా నగదు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడన్న ఆరోపణలపై ఇప్పటికే దర్యాప్తు సంస్థల విచారణ కొనసాగుతోంది. ఈ విషయంలోనే ఆయన అరెస్ట్ కానున్నారు. అయితే ట్రంప్ అరెస్ట్‭కు వ్యతిరేకంగా ఆయన మద్దతుదారులు నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. తనతో ఉన్న సంబంధాన్ని బహిరంగపర్చకుండా ఉండేందుకు పోర్న్ స్టార్‭తో ఒప్పందం చేసుకున్నారట. ఇందుకు గాను ఆమెకు 1.30 లక్షల అమెరికా డాలర్లు ట్రంప్ ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.

Amit Shah On Rahul Gandhi: రాహుల్ వ్యాఖ్యలపై మాజీ ప్రధాని ఇందిరాను ప్రస్తావించిన అమిత్ షా

అయితే ఈ సంబంధం గురించి సదరు పోర్న్ స్టారే కోర్టుకెక్కడం గమనార్హం. ట్రంప్‭తో తనకు శారీరక సంబంధం ఉందని, తమ మధ్య జరిగిన నాన్ డిస్‭క్లోజర్ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ లాస్ ఏంజెల్స్‭లోని కోర్టులో ఆమె దావా వేసింది. అయితే ఈ కేసులో ట్రంప్ మీద కేసు మోపాలా లేదా అని ప్రాసిక్యూటర్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం. కానీ ఈలోపే ఆయన అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే నేరారోపణలు ఎదుర్కొన్న మొదటి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రకెక్కుతారు.