Ukraine X Russia: ఉక్రెయిన్‌తో యుద్ధంలో పుతిన్ గెలవలేరు: జర్మన్ ఛాన్స్లర్
ఈ విషయమై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పలుమార్లు ఫోన్లో మాట్లాడిన జర్మన్ ఛాన్స్లర్ స్కోల్జ్.. ఇక ఉక్రెయిన్ను జయించలేమని గ్రహించినప్పుడు పుతిన్ శాంతియుతంగా ఆలోచిస్తారని అన్నారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు కల్పిస్తూ రష్యాపై భారీ ఆంక్షలు విధిస్తున్న పాశ్చాత్య మిత్రదేశాలు.. ఉక్రెయిన్‌కు తమ మద్దతును కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
- tony bekkal
- Published On : November 24, 2022 / 04:03 PM IST
German Chancellor says Vladimir Putin can no longer win war in Ukraine
Ukraine X Russia: ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గెలవలేరని జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ అన్నారు. అదే విధంగా ఈ యుద్ధం ఆధారంగా నాటో సైనిక కూటమి క్రియాశీలంగా మారదని ఆయన నొక్కి చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు హాజరైన గ్లోబల్ బిజినెస్ కమ్యూనిటీతో ఆయన మాట్లాడుతూ పుతిన్ తన వ్యూహాత్మక లక్ష్యాలన్నింటిలో ఇప్పటికే విఫలమయ్యారని స్కోల్జ్ అన్నారు.
ఉక్రెయిన్‌తో యుద్ధంలో తన దూకుడు ప్రదర్శించే ముందు మిత్రదేశాల బలాన్ని తక్కువగా అంచనా వేశారని అన్నారు. వాస్తవానికి ఈ యుద్ధంలో రష్యా గెలవకూడదని తాము అనుకున్నామని, అయితే గెవలేరని ఇప్పటికే స్పష్టమైందని స్కోల్జ్ అన్నారు. యుద్ధం ప్రారంభించిన ఆదిలోనే ఉక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని పుతిన్ భావించారని, అయితే ఉక్రెయిన్ అద్భుతంగా పోరాడుతూ రష్యాను నిలువరిస్తోందని కొనియాడారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన ఇప్పటికే నాలుగు నెలలు పూర్తైంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా రెండో పెద్ద నగరం ఖార్కీవ్ను సొంతం చేసుకునేందుకు రష్యా మొదట ప్రయత్నించి విఫలమైంది. అనంతరం ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైన డాన్‌బాస్‌పై పట్టు చిక్కించుకోవడానికి ప్రయత్నం జరుగుతోంది.
ఈ విషయమై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పలుమార్లు ఫోన్లో మాట్లాడిన జర్మన్ ఛాన్స్లర్ స్కోల్జ్.. ఇక ఉక్రెయిన్ను జయించలేమని గ్రహించినప్పుడు పుతిన్ శాంతియుతంగా ఆలోచిస్తారని అన్నారు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు కల్పిస్తూ రష్యాపై భారీ ఆంక్షలు విధిస్తున్న పాశ్చాత్య మిత్రదేశాలు.. ఉక్రెయిన్‌కు తమ మద్దతును కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Rats-marijuana: రూ.60 లక్షల విలువైన గంజాయి ఏమైంది?.. ఎలుకలు తిన్నాయన్న పోలీసులు