Rats-marijuana: రూ.60 లక్షల విలువైన గంజాయి ఏమైంది?.. ఎలుకలు తిన్నాయన్న పోలీసులు

దాదాపు 581 కిలోల గంజాయిని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మథుర జిల్లాలోని హైవే, షేర్‌గఢ్ పోలీస్ స్టేషన్ల గిడ్డంగుల్లో దాన్ని భద్రపరిచారు. ఆ గంజాయిని తమ ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను మథుర కోర్టు ఆదేశించింది. దీంతో ఆ గంజాయినంతా ఎలుకలు తినేశాయని పోలీసులు చెప్పారు. ఆ ఎలుకలు అన్నీ చాలా చిన్నగా ఉంటాయని, పోలీసులకు భయపడవని కూడా వారు చెప్పడం గమనార్హం.

Rats-marijuana: రూ.60 లక్షల విలువైన గంజాయి ఏమైంది?.. ఎలుకలు తిన్నాయన్న పోలీసులు

Rats-marijuana: నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లు అన్నీ ఏమయ్యాయంటే స్టోర్ రూమ్ లోని ఎలుకలు ఆ మద్యాన్ని తాగేశాయని గతంలో చెప్పి వార్తల్లోకెక్కారు ఉత్తర ప్రదేశ్ పోలీసులు. ఇప్పుడు కూడా మరోసారి అటువంటి సమాధానమే ఇచ్చి షాక్ ఇచ్చారు. దాదాపు 581 కిలోల గంజాయిని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మథుర జిల్లాలోని హైవే, షేర్‌గఢ్ పోలీస్ స్టేషన్ల గిడ్డంగుల్లో దాన్ని భద్రపరిచారు.

ఆ గంజాయిని తమ ముందు ప్రవేశపెట్టాలని పోలీసులను మథుర కోర్టు ఆదేశించింది. దీంతో ఆ గంజాయినంతా ఎలుకలు తినేశాయని పోలీసులు చెప్పారు. ఆ ఎలుకలు అన్నీ చాలా చిన్నగా ఉంటాయని, పోలీసులకు భయపడవని కూడా వారు చెప్పడం గమనార్హం. ఆ గంజాయి విలువ దాదాపు రూ.60 లక్షలు ఉంటుంది.

ఎలుకలు అన్నీ కలిసి గంజాయిని నాశనం చేశాయని పోలీసుల తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. దీంతో, గంజాయిని ఎలుకలే నాశనం చేశాయన్న విషయంపై ఈ నెల 26లోపు ఆధారాలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. యూపీ పోలీసులు మద్యం, గంజాయి గురించి కోర్టుకు చెబుతున్న సమాధానాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..