Musk-Nicole Affair: పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన ఎలాన్ మస్క్.. ఎఫైర్ కారణంగా భార్యకు విడాకులు ఇవ్వనున్న గూగుల్ కో-ఫౌండర్

గూగుల్ సహ వ్యవస్థాపకుడు బ్రిన్ 2008లో టెస్లాలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాడు. ఎలోన్ మస్క్, సెర్గీ బ్రిన్ చిరకాల స్నేహితులు. మస్క్ కొన్నేళ్లుగా బ్రిన్ సిలికాన్ వ్యాలీ ఇంటిని క్రమం తప్పకుండా సందర్శించేవాడు. ఈ సమయంలో నికోల్ షానహన్‌కు మస్క్ మరింత దగ్గరయ్యాడు.

Elon Musk and Nicole Shanahan Affair: ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలోన్ మస్క్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. ఎలోన్ మస్క్ కారణంగా గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ తన భార్య నికోల్ షానహాన్‌కు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎలోన్ మస్క్, బ్రిన్ భార్య నికోల్ షానహన్ మధ్య గత ఏడాది నుంచి ఎఫైర్ నడుస్తోంది. అయితే, ఈ వార్తలను ఎలాన్ మస్క్ తోసిపుచ్చారు. సెర్గీ, తాను స్నేహితులమని, గత రాత్రి కలిసి పార్టీలో ఉన్నామని అతను చెప్పాడు. తాను నికోల్‌ని మూడేళ్లలో రెండుసార్లు మాత్రమే చూశానని, తమ మధ్య అలాంటిదేమీ లేదని ఎక్స్ ఖాతా ద్వారా మస్క్ వెల్లడించాడు.

గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ తన భార్య, మస్క్‌ల మధ్య అక్రమ సంబంధం ఉన్నందున అతని భార్య నుంచి విడాకులు కోరినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వార్తలను ప్రచురించింది. అయితే ఇప్పుడు ఈ వార్త నిరాధారమని మస్క్ పేర్కొన్నాడు. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, ఎలోన్ మస్క్, సెర్గీ బ్రిన్ చిరకాల స్నేహితులు. మస్క్ కొన్నేళ్లుగా బ్రిన్ సిలికాన్ వ్యాలీ ఇంటిని క్రమం తప్పకుండా సందర్శించేవాడు. ఈ సమయంలో నికోల్ షానహన్‌కు మస్క్ మరింత దగ్గరయ్యాడు.

Elon Musk: అంబర్ హర్డ్‭తో డేటింగ్, మాజీ భార్యతో రహస్యంగా 10వ బిడ్డ.. ఎలాన్ మస్క్ జీవితంలోని సంచలన రహస్యాల్ని బయటపెట్టిన జీవిత చరిత్ర!

ఈ వార్తల అనతరం, సెర్గీ బ్రిన్ ఇటీవలి నెలల్లో ఎలోన్ మస్క్ కంపెనీలలో తన వ్యక్తిగత పెట్టుబడులను విక్రయించమని తన సలహాదారులను ఆదేశించాడు. మస్క్ కంపెనీలలో బ్రిన్ వ్యక్తిగత పెట్టుబడి ఎంతనేదాని గురించి ఇంకా సమాచారం వెల్లడి కాలేదు. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం, మస్క్ కంపెనీలలో సెర్గీ బ్రిన్ తన వాటాను విక్రయించారా లేదా అనే దానిపై ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. ఒక నివేదిక ప్రకారం, గూగుల్ సహ వ్యవస్థాపకుడు బ్రిన్ 2008లో టెస్లాలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాడు.

Erica Robin : తొలిసారిగా మిస్ యూనివర్స్ పాకిస్తాన్ ఎరికా రాబిన్ గురించి మీకు తెలియని వాస్తవాలు

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, మస్క్ 242 బిలియన్ డాలర్ల నికర సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. బ్రిన్ 94.6 బిలియన్ల డాలర్ల ఆస్తులతో ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో మస్క్ కవలలకు తండ్రని, అతని తల్లి తన కంపెనీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ న్యూరాలింక్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగని నివేదికలు వెల్లడించాయి. జర్నల్ ప్రకారం, షనాహన్‌తో మస్క్‌కి సంబంధం డిసెంబర్‌లో మియామిలోని ఆర్ట్ బాసెల్‌లో ప్రారంభమైంది. అయితే, మస్క్ ఒక ఈవెంట్‌లో బ్రిన్‌కి క్షమాపణలు కూడా చెప్పాడు. బ్రీన్, షానహన్ మధ్య వివాహ ఒప్పందంపై చర్చలు జరుపుతున్నారు. ఇందులో షానహన్ ఒక బిలియన్ డాలర్లకు పైగా డిమాండ్ చేసినట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు