హద్దు మీరారు: నలుగురు గూగుల్ ఉద్యోగులు ఔట్

గూగుల్ సంస్థ ఉద్యోగులకు కావాలసినంత స్వేచ్ఛనిచ్చి వారిలోని క్రియేటివిటీని బయటపెట్టాలని తపనపడుతుంటుంది. అదే హద్దు మీరితే.. కంపెనీ అవసరాలకు మించి ఉద్యోగులు ప్రవర్తిస్తే ఏ మాత్రం ఆలోచించకుండా తీసి పక్కనపడేస్తానంటోంది. ఈ మేర సోమవారం నలుగురు ఉద్యోగులను తొలిగిస్తున్నట్లు అధికారిక మెయిల్ పంపింది. 

డేటా సెక్యూరిటీ నియమాలు ఉల్లంఘించినందుకు ఉద్యోగాలు తీసేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే అధికారులపై లైంగిక వేధింపుల ఆరోపణ, ప్రతికూల వాతావరణ ఏర్పాటు, మిలటరీ కాంటాక్ట్‌లను బహిర్గతం చేయడం, చైనాలోని సెన్సార్డ్ సెర్చ్ ఇంజిన్ వివరాలను లీకింగ్ వంటి కారణాలతో గూగుల్ కొందరిని ఉద్యోగాల్లో నుంచి తొలగించింది. 

గూగుల్ తీసుకుంటున్న చర్యలపై నిరసిస్తూ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉద్యోగులు నిరసన తెలిపారు. అనుమతి లేకుండా సెలవులు తీసుకున్నారనే కారణంతో తొలగించిన ఇద్దరి ఉద్యోగులను మళ్లీ విధుల్లోకి తీసుకుంది. అయినప్పటికీ సంస్థకు వ్యతిరేకంగా, నియమాలను అతిక్రమించి ఎటువంటి చర్యలకు పాల్పడినా విధుల్లోకి తొలగించేందుకు వెనుకాడమని సంస్థ అధికారులు తెలిపారు.