పెళ్లికి గిఫ్ట్‌లు కాదు.. హనీమూన్‌కు డబ్బులివ్వండి

వెడ్డింగ్ కార్డుల్లో చాలా రకాలు చూసుంటాం. కార్డు చివర్లో బంధుమిత్రుల అభినందనలతో అనే రొటీన్ కార్డులతో పాటు ఫన్నీ కామెంట్లు చాలానే చూశాం. భిన్నంగా ఆలోచించిందీ జంట. పెళ్లికి వచ్చిన వారు గిఫ్ట్‌లు కాదు డబ్బులివ్వండి. మా హనీమూన్‌కు ఫైనాన్షియల్ హెల్ప్ చేయండంటూ రాసుకొచ్చిందీ జంట. 

ఎవరైనా పెళ్లి కార్డు పంచితే అందులో డేట్, టైం, లొకేషన్ హైలెట్ కావాలి కానీ, ఈ హనీమూన్ గొడవేంట్రా బాబూ అని కామెంట్ చేస్తున్నారు. పెళ్లి కార్డును పోస్టుల్లో పంపడమే కాకుండా సోషల్ మీడియాలోనూ పంచుకుంది ఆ జంట. పెళ్లి చేసుకుని మేం కలిసి ఉంటామని మాట ఇస్తున్నాం. మా హనీమూన్‌కు సాయం చేయండంటూ అందులో రాశారు. 

మీరు పెళ్లి చేసుకుంటుంది గిఫ్ట్‌ల కోసమేనా.. హనీమూన్ కోసమా..  పెళ్లి చేసుకొమ్మని ఎవరు బలవంతపెట్టారు. డబ్బులు డొనేట్ చేయమని గుండెనొప్పి తీసుకొస్తున్నారు. ఈ పెళ్లికి నేనైతే వెళ్లను. ఆ వేడుకను వాళ్లు తప్ప ఇంకెవ్వరూ సెలబ్రేట్ చేసుకోలేరు. ఆ ఇన్విటేషన్ కాస్తా విమర్శలకు గురైంది. 

మేం డబ్బులిస్తే మీరు పండుగ చేస్కుంటారంట. ఏం లవ్లీ కపుల్‌రా బాబూ. మీ పెళ్లికి ఎవడూ రాడు. ఫ్రెండ్ అనే వాడెవ్వడూ దీనిని ఒప్పుకోడు. అంటూ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలి కానీ.. గిఫ్ట్‌లు గురించి అడుక్కుంటుంటే ఎవరు మాత్రం సరే అంటారు చెప్పండి.!