Helicopters Collide MidAir : ఘోర ప్రమాదం.. గాల్లో ఉండగా ఢీకున్న రెండు హెలికాప్టర్లు.. గిరగిరా తిరుగుతూ.. వీడియో వైరల్

Helicopters Collide MidAir : గ్రీస్‌లో కార్చిచ్చు మంటలను అదుపు చేసే క్రమంలో రెండు అగ్నిమాపక హెలికాప్టర్లు గాల్లోనే ఢీకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Helicopters Collide MidAir

Helicopters Collide MidAir : గ్రీస్‌లో కార్చిచ్చు మంటలను అదుపు చేసే క్రమంలో రెండు అగ్నిమాపక హెలికాప్టర్లు గాల్లోనే ఢీకొన్న విషాద ఘటన చోటుచేసుకుంది. ఏథెన్స్‌కు పశ్చిమాన ఉన్న అట్టికా ప్రాంతంలోని ప్సాథా (Psatha) వద్ద ఈ ప్రమాదం ఆదివారం జరిగింది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read : Farmer Crocodile : ఇంత ధైర్యమా..! పొలంలో మొసలి.. భుజాన వేసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రైతు.. వీడియో వైరల్..

ఇటీవల యూరప్‌ను తీవ్ర వేడి, కరువు పరిస్థితులు వెంటాడుతుండటంతో గ్రీస్‌లో అడవిలో భారీగా మంటలు చెలరేగుతున్నాయి. వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, హెలికాప్టర్లు, విమానాలతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రెండు హెలికాప్టర్లు ఢీకొనడంతో ఓ విమానంకు మంటలు అంటుకొని ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయింది.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మంటలపై నీటిని చల్లేందుకు తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న రెండు బెల్ హెలికాప్టర్లు ఒకదానికొకటి అత్యంత సమీపంగా రావడంతో.. పైభాగంలో ఉన్న విమానం కిందభాగంలో ఉన్న హెలికాప్టర్ ను ఢీకొట్టింది. దీంతో హెలికాప్టర్ మంటల్లో చిక్కుకుని కుప్పకూలగా, మరో హెలికాప్టర్ స్వల్పంగా దెబ్బతిని సురక్షితంగా ల్యాండ్ అయింది.

ఈ ప్రమాదంలో ఒక హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు గ్రీస్ అగ్నిమాపక శాఖ అధికారికంగా వెల్లడించింది. మరో హెలికాప్టర్‌లోని ఇద్దరు సిబ్బందిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.