Plane Crash : కరేబియన్ సముద్రంలో కూలిన చిన్న విమానం…హాలీవుడ్ నటుడు, అతని ఇద్దరు కూతుళ్ల మృతి

హాలీవుడ్ ప్రముఖ నటుడు క్రిస్టియన్ ఒలివర్, అతని ఇద్దరు కూతుళ్లు విమాన ప్రమాదంలో మరణించారు. జర్మనీలో జన్మించిన హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ తన ఇద్దరు చిన్న కుమార్తెలతో పాటు వారు ప్రయాణిస్తున్న చిన్న విమానం టేకాఫ్ తర్వాత కరేబియన్ సముద్రంలో కూలిపోయిందని స్థానిక పోలీసులు తెలిపారు....

Plane Crash : కరేబియన్ సముద్రంలో కూలిన చిన్న విమానం…హాలీవుడ్ నటుడు, అతని ఇద్దరు కూతుళ్ల మృతి

Hollywood Actor Christian Oliver

Plane Crash : హాలీవుడ్ ప్రముఖ నటుడు క్రిస్టియన్ ఒలివర్, అతని ఇద్దరు కూతుళ్లు విమాన ప్రమాదంలో మరణించారు. జర్మనీలో జన్మించిన హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ తన ఇద్దరు చిన్న కుమార్తెలతో పాటు వారు ప్రయాణిస్తున్న చిన్న విమానం టేకాఫ్ తర్వాత కరేబియన్ సముద్రంలో కూలిపోయిందని స్థానిక పోలీసులు తెలిపారు.

ALSO READ : Bangladesh : బంగ్లాదేశ్ బెనాపోల్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం…నలుగురు మృతి

‘ది గుడ్ జర్మన్’ 2008 యాక్షన్-కామెడీ,స్పీడ్ రేసర్లో జార్జ్ క్లూనీతో కలిసి పెద్ద స్క్రీన్‌పై కనిపించిన ఒలివర్ గురువారం రాయల్ సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్ పోలీస్ ఫోర్స్ ప్రైవేట్ యాజమాన్యానికి చెందిన విమాన ప్రమాదంలో మరణించాడు. మత్స్యకారులు, కోస్ట్ గార్డులు వెంటనే కరేబియన్ సముద్రంలోని సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడ నాలుగు మృతదేహాలను వెలికితీశారు. ఈ విమాన ప్రమాదంలో ఒలివర్ (51), అతని కుమార్తెలు మడిత (10), అన్నీక్ (12), పైలట్ రాబర్ట్ సాచ్స్‌తో కలిసి మరణించారు.

ALSO READ : Train Derail : రాజస్థాన్‌లో పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు

ఈ విమానం గురువారం మధ్యాహ్నం తర్వాత గ్రెనడైన్స్‌లోని చిన్న ద్వీపం బెక్వియా నుంచి సెయింట్ లూసియాకు ప్రయాణిస్తోండగా సముద్రంలో కుప్పకూలిపోయింది. ఒలివర్ కుటుంబం పర్యటనకు వెళ్లి వస్తుండగా ఈ విమాన ప్రమాదం జరిగింది. ఒలివర్ 60కిపైగా చిత్రాల్లో నటించారు.