Skating
Igor’ is 73 YO: కుర్రాళ్లే చేస్తారా ? ఏం నేను ఎందుకు చేయలేను అంటూ ఓ తాత చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. సూపర్ అంటూ ఆ తాతను ప్రోత్సాహిస్తున్నారు. కుర్రాళ్లకు ధీటుగా ఆయన చేసిన ఓ పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకు ఆయన ఏం చేశాడు అనేగా మీ డౌట్. ఆయన చేసింది స్కేటింగ్. ఒకరకంగా చెప్పాలంటే..ఆ వయస్సలో చేయడం పెద్ద సాహసమే అని చెప్పాలి. ఏ మాత్రం స్కిడ్ అయినా..గాయాలపాలు కావడం ఖాయం.
Read More : Social Media : ఆన్‌లైన్ ఫ్రెండ్‌ని నమ్మి వెళితే అఘాయిత్యం చేసి.. అశ్లీల వీడియోలు తీశాడు
స్కేటింగ్ ఇదొక క్రీడ. రోడ్లపై స్కేటింగ్ చేస్తుంటారు చాలా మంది యూత్. రెండు కాళ్ల కింద..చక్కల్లాంటి దానిపై అటూ..కాళ్లు కదుపుతూ యమ స్పీడ్ గా ముందుకెళుతుంటారు. కుర్రాళ్లే ఎందుకు చేయాలి ? నేను ఎందుకు చేయకూడదని 73 ఏళ్ల వృద్ధుడు భావించి..తన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. స్కేట్ బోర్డుపై వంగి జాలీగా రోడ్లపై రయ్యి రయ్యిమంటూ వెళ్లారు. ప్రతిభకు వయస్సు అడ్డు కాదని నిరూపించారు. యాక్చువల్ గా ఈ వీడియో పాతదే. మాక్స్ తిముకిన్ అనే వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశారు. 73 ఏళ్ల వయ్సస్సు అని మరిచిపోకండి…ఆయన 1981 నుంచి స్కేట్ బోర్డును రఫ్పాడిస్తున్నాడు..అంటూ పోస్టు చేశారు. మరోసారి ఈ వీడియో వైరల్ అయ్యింది.