Indian Student: ఇండియన్ స్టూడెంట్ సమస్య చూసి స్పెషల్ ప్లైట్ ఏర్పాటు చేసిన ఆస్ట్రేలియా

మానవత్వం ప్రదర్శించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఆ దేశంలో చదువుకుంటున్న ఇండియన్ స్టూడెంట్ క్రోనిక్ రెనాల్ ఫెయిల్యూర్ తో బాధపడుతుండటంతో అతని కోసం ప్రత్యేక విమానం కేటాయించి అందులో ఇండియాకు పంపింది.

Indian Student

Indian Student: మానవత్వం ప్రదర్శించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఆ దేశంలో చదువుకుంటున్న ఇండియన్ స్టూడెంట్ క్రోనిక్ రెనాల్ ఫెయిల్యూర్ తో బాధపడుతుండటంతో అతని కోసం ప్రత్యేక విమానం కేటాయించి అందులో ఇండియాకు పంపింది. 2018లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన 25ఏళ్ల అర్ష్‌దీప్ సింగ్ సోమవారం సాయంత్రం ఇండియాకు చేరుకుని గురుగ్రామ్ మేదాంతా హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు.

డార్విన్ నుంచి Qantas నిర్వహిస్తున్న ఎయిర్ లిఫ్ట్ లో ఇక్కడకు చేర్చడంతో మానవత్వంతో కూడిన ఈ నిర్ణయానికి అతని కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ‘నా స్వదేశానికి చేర్చినందుకు ఇండియన్, ఆస్ట్రేలియా ప్రభుత్వాలకు థ్యాంక్స్ చెబుతున్నా’ అని ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన అర్షదీప్ సింగ్ అన్నాడు. కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కు థ్యాంక్స్ చెబుతున్నారు.

‘నాకు మాటల్లేవ్. ఇండియా గవర్నమెంట్‌కు, ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రభుత్వం, డయాలసిస్ స్టార్ చేసిన ఆస్ట్రేలియా డాక్టర్లకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. దేవుడి దయతో మా బిడ్డ ఇక్కడకు వచ్చేశాడు’ అని స్టూడెంట్ తల్లి ఇంద్రజిత్ కౌర్ మీడియాతో అన్నారు.

మెల్‌బౌర్న్‌లో చదువుకుంటున్న సింగ్.. జూన్ 8న లోకల్ హాస్పిటల్ కు వెళ్లి టెస్టు చేయించుకోగా రెనాల్ ఫెయిల్యూర్ అనే సంగతి తెలిసింది. అతని కిడ్నీలు పరీక్ష చేయడం లేదని నిర్ధారణ అయింది. ‘అతని గుండెకు సైతం సమస్య ఉన్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. కొవిడ్ వాతావరణం కనిపిస్తున్న సమయంలో.. అవయవ మార్పిడి కోసం ప్రయత్నిస్తున్నారు’ అని కుటుంబ సభ్యులు అంటున్నారు.

పూర్తి మెడికల్ ఎక్విప్మెంట్ తో పాటు విమానంలో ప్రయాణిస్తున్న వీడియోను ట్వీట్ చేసి ఇండియా వచ్చేశాడు కాబట్టి కళ్లముందే ట్రీట్మెంట్ చేయించుకుంటామని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.