Internet Blackout : నయా రికార్డ్.. 36 రోజులుగా ఇంటర్నెట్ బంద్.. కారణమిదే
Internet Blackout : సుమారు 36 రోజులుగా ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి.. ఇరాన్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
- Dharani Pilli
- Published On : April 6, 2026 / 08:58 AM IST
iran creats new record for 864 housr internet blackout enter into 37th day
- ఇరాన్ సరికొత్త రికార్డ్
- 864 గంటలు అంటే 36 రోజులుగా ఇంటర్నెట్ బంద్
- అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ప్రారంభమైన నాటి నుంచి బంద్
Internet Blackout : స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగాక ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా గంట సేపు కూడా గడపలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ ఓ దేశంలో మాత్రం ఒకటి రెండు కాదు.. ఏకంగా 864 గంటల పాటు ఇంటర్నెట్ బంద్ చేశారు. ఆ దేశ ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేశారు. ఇంతకీ అది ఏ దేశం.. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటే..
ఇన్ని గంటల పాటు ఇంటర్నెట్ సేవలు బంద్ చేసిన దేశం ఇరాన్. అమెరికా-ఇజ్రాయెల్‌ల దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అంటే గత ఐదు వారాలుగా ఆ దేశంలో ఇంటర్నెట్ కనెక్షన్ మీద ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దీని గురించి ఇంటర్నెట్ పర్యవేక్షణా సంస్థ ‘నెట్‌బ్లాక్స్’ ఆసక్తికర అంశం వెల్లడించింది. ఇరాన్‌లో ఏకధాటిగా 864 గంటల పాటు, అంటే సుమారు 36 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి ఆ దేశం నయా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఏ దేశం కూడా ఇంత సుదీర్ఘకాలం ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించలేదని పేర్కొంది.
Bottled Water Prices Hike : ఇరాన్-అమెరికా యుద్ధం.. ఇండియాలో భారీగా పెరగనున్న వాటర్ బాటిల్ ధరలు
ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జంటగా కలిసి ఇరాన్ మీద దాడి ప్రారంభించాయి. ఈ క్రమంలో ఇరాన్ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. దీంతో ఆ దేశానికి ప్రపంచ దేశాలతో సంబంధాలు తెగిపోయాయి. దేశీయంగా పరిమిత స్థాయిలోనే ఈ సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మయన్మార్, సూడాన్‌తో పాటు పలు దేశాల్లో సంక్షోభ సమయాల్లో ఇలాంటి ఆంక్షలు విధించిన సందర్భాలు ఉన్నప్పటికీ.. ఇంత సుదీర్ఘ కాలం పాటు ఏ దేశమూ కొనసాగించలేదని నెట్‌బ్లాక్స్ పేర్కొంది. ఇదిలా ఉంటే, నియంత కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఉన్న ఉత్తర కొరియా మాత్రం ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంతో అనుసంధానం కాకుండా మొదటి నుంచీ దూరంగా ఉందని గుర్తు చేసింది.
ఉక్రెయిన్, గాజా యుద్ధాల వల్ల అక్కడి మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో ఆ దేశాల్లో కడా ఇంటర్నెట్ సేవలకు సుదీర్ఘ కాలం అంతరాయం ఏర్పడింది. ఫలితంగా నెట్ వినియోగించే వారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. కాకపోతే యుద్ధం కారణంగా ఏ దేశం కూడా ఇంటర్నెట్‌ను ఈ స్థాయిలో నిలిపివేయలేదు.
