Iran War: యుద్ధం ముగించేందుకు సిద్ధం..! మూడు కండీషన్లు పెట్టిన ఇరాన్

అమెరికా రగిల్చిన యుద్ధాన్ని ముగించేందుకు మా మూడు షరతులను అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Updated on- March 12, 2026 / 06:50 PM IST

Iranian President Masoud Pezeshkian Representative Image (Image Credit To Original Source)

  • ఇరాన్ చట్టబద్ధ హక్కులను గుర్తించాలి
  • యుద్ధంలో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి
  • భవిష్యత్తులో దాడులు చేయబోమని హామీ ఇవ్వాలి

Iran War: అమెరికా-ఇజ్రాయెల్ తో చేస్తున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ ముందుకు వచ్చింది. కానీ మూడు షరతులు విధించింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు ఎక్స్ లో పోస్ట్ చేశారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాంతికి ఇరాన్ కట్టుబడి ఉంది. రష్యా, పాకిస్తాన్ నాయకులతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. అమెరికా రగిల్చిన యుద్ధాన్ని ముగించేందుకు మా మూడు షరతులను అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరాన్ చట్టబద్ధ హక్కులను గుర్తించాలి, యుద్ధంలో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి, భవిష్యత్తులో దాడులు చేయబోము అని పటిష్టమైన అంతర్జాతీయ హామీలు ఇవ్వాలి అని ఇరాన్ అధ్యక్షుడు డిమాండ్ చేశారు.

Also Read: టారిఫ్ బాంబ్.. మళ్లీ సుంకాలు విధించేందుకు సిద్ధమైన ట్రంప్..! సరికొత్త అస్త్రం సెక్షన్ 301 ప్రయోగం..!