×
Ad

Gandhi Museum In America : అమెరికాలో భారత జాతిపితకు అరుదైన గౌరవం.. న్యూజెర్సీలో మహాత్మాగాంధీ మ్యూజియం

భారత జాతిపిత మహాత్మాగాంధీకి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. న్యూజెర్సీలో మహాత్మాగాంధీ మ్యూజియం ఏర్పాటు చేశారు. గాంధీ జీవిత విశేషాలు, జాతికి ఆయనిచ్చిన సందేశాలతో కూడిన మ్యూజియం ప్రారంభమైంది.

  • Published On : October 12, 2022 / 12:01 PM IST

Gandhi Museum

Gandhi Museum In America : భారత జాతిపిత మహాత్మాగాంధీకి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. న్యూజెర్సీలో మహాత్మాగాంధీ మ్యూజియం ఏర్పాటు చేశారు. గాంధీ జీవిత విశేషాలు, జాతికి ఆయనిచ్చిన సందేశాలతో కూడిన మ్యూజియం ప్రారంభమైంది. న్యూజెర్సీలోని అట్లాంటిక్‌ నగరంలో దీన్ని గతవారం ప్రారంభించారు.

Elephant Eating Panipuri: పానీపూరిని తెగ లాగించేసిన ఏనుగు.. వీడియో వైరల్.. ఫిదా అవుతున్న నెటిజన్లు

ఇందులో ఏర్పాటు చేసిన కళాఖండాలు, డిజిటల్‌ డిస్‌ప్లేల ద్వారా గాంధీ జీవిత సంఘటనలను ప్రత్యక్ష అనుభూతితో తెలుసుకోవచ్చు. ఈ మ్యూజియాన్ని ఆదిత్య బిర్లా గ్రూప్‌ భాగస్వామ్యంతో న్యూజెర్సీ గాంధీయన్‌ సొసైటీ నిర్మించింది. యూఎస్‌లో గాంధీజీకి అంకితం చేసిన మొదటి మ్యూజియం ఇదే కావడం గమనార్హం.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.