రిపోర్ట్ ల ప్రకారం… ఐర్లాండ్‌కు నైరుతి దిశలో ఉన్న ఈ 157 ఎకరాల ఐల్యాండ్ ను వీడియో టూర్లో చూసిన తర్వాత అయన కొన్నాడు. వాట్సాప్ సంభాషణ ద్వారానే విక్రేతతో కొనుగోలుదారుడు డీల్ గురుంచి చర్చించినట్లు సమాచారం.
ఈ ఐల్యాండ్ లో 3 బీచ్‌లు, 7 ఇళ్ళు మరియు నేచురల్ వైల్డ్ లైఫ్ ఉన్నట్లు సమాచారం. ఈ ద్వీపం 19 వ శతాబ్దంలో ఒక చిన్న రాగి పరిశ్రమకు నిలయంగా ఉంది. ఈ ద్వీపం చుట్టూ గనులు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మాంటెగ్ రియల్ ఎస్టేట్ ప్రకారం.. దాని జనాభా 1841 లో 137 మందికి చేరుకుంది, కాని 1960 ల నాటికి దాని నివాసులందరూ వెళ్లిపోయారు.