Holding An EGG : పిడికిలిలో గుడ్డు పగలకుండా..కూల్ డ్రింక్ క్యాన్‌‌లను పగలగొట్టాడు…ఎలా సాధ్యం ?

ధనాధన్ అంటూ..కూల్ డ్రింక్స్ క్యాన్ లను పగులగొడుతున్నాడు. వెనుకాలే ఉన్న ఓ వ్యక్తి నిశితంగా గమనిస్తున్నాడు. ఆ ఏముంది ఇందులో వింత. బలంగా ఉంటే..ఎవరైనా పగలగొడుతారు అంటారు కదా. ఇక్కడే ఉంది అసలైన విషయం.

Holding Egg

John Paul K R: ధనాధన్ అంటూ..కూల్ డ్రింక్స్ క్యాన్ లను పగులగొడుతున్నాడు. వెనుకాలే ఉన్న ఓ వ్యక్తి నిశితంగా గమనిస్తున్నాడు. ఆ ఏముంది ఇందులో వింత. బలంగా ఉంటే..ఎవరైనా పగలగొడుతారు అంటారు కదా. ఇక్కడే ఉంది అసలైన విషయం. అతని పిడికిలిలో గుడ్డు పెట్టుకుని పగలగొట్టాడు. కానీ..గుడ్డు మాత్రం పగలలేదు. అన్నీ పగలగొట్టిన తర్వాత..గుడ్డును పగులగొట్టి గ్లాసులో పోసుకున్నాడు.

కేవలం 30 సెకన్లలో మొత్తం 52 డబ్బాలను పగలగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇతని ఫర్మామెన్స్ చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. కోడిగుడ్డు పగలకుండా…ఇతను చేసిన ప్రదర్శనను మెచ్చుకుంటున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన కేఆర్ జాన్ పాల్ ఈ అరుదైన రికార్డు సృష్టించాడు.