రంజాన్ రోజుల్లో 5 లక్షల ముస్లింలకు ఫ్రీగా హలాల్ మీల్స్

  • Publish Date - April 29, 2020 / 07:02 AM IST

కరోనా వైరస్ మహమ్మారి లక్షల మంది జీవితాలపై ప్రభావం చూపించింది. న్యూయార్కర్లో చాలా మంది నష్టపోయారు. ఈ పరిస్థితుల్లోనూ పవిత్ర మాసాన్ని భద్రంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నవారికి ప్రభుత్వమే సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఈ రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండేందుకు కొన్ని చారిటీలు తోచినంత సాయం చేసేవి. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక దూరం పాటించాల్సిన రీత్యా అది కుదరడం లేదు. 

ఆ కుటుంబాలను కాపాడాలనే కాన్సెప్ట్ తోనే న్యూయార్క్ సిటీ 5లక్షల ముస్లింలకు రంజాన్ సందర్భంగా ఉచిత భోజనాలు అందజేయనున్నారు. ఇస్లాం నియమానుసారం హలాల్ భోజనం తయారుచేసి పంచుతున్నారు. ‘రంజాన్ ముఖ్య ఉద్దేశ్యం ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం’ అని గురువారం మేయర్ బిల్ డే బ్రాసియో మీడియా సమావేశంలో అన్నారు. 

సెలవురోజులను గడపడంలో ఇది చాలా కీలకం. అవసరాలను గుర్తించి వాటిని తీర్చడంలో మునుపెన్నడూ ఇంత కష్టపడలేదు. న్యూయార్క్ లో 22శాతం కంటే ఎక్కువ మంది ఉన్న ముస్లింలు ఉంలారు. వారి సెలబ్రేషన్స్ తో ప్రజారోగ్యం ఇబ్బందుల్లో పడుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు అధికారులు. 

రంజాన్ రోజుల్లో చాలా మసీదుల్లో ఉచిత భోజనాలు పెట్టి, పని కల్పించేవారు. ఈ సారి ప్రభుత్వం పంచి పెడుతున్న స్కూల్ కేంద్రాల్లోనే 4లక్షల హలాల్ మీల్స్ ఉంచి ముస్లిం సోదరులకు అందిస్తున్నారు. మరో లక్ష హలాల్ మీల్స్ సూప్ కిచెన్లు, ఫుడ్ ప్యాంట్రీలు, కమ్యూనిటీ ఆర్గనైజేషన్ల ద్వారా పంచిబెడుతున్నారు. 

న్యూయార్కర్లకు ఏప్రిల్ నెలలో 10మిలియన్ ఫ్రీల్స్, మే నెలలో 15మిలియన్ ఫ్రీ మీల్స్ ఇవ్వనున్నట్లు మేయర్ వెల్లడించారు. వైరస్ కారణంగా 2మిలియన్ మందికి భోజనం లేకుండా పోయింది. ఏ వ్యక్తి ఆకలితో ఉండకూడదు. మీ నగరమే మిమ్మల్ని పోషిస్తుందని ఆయన అన్నారు.