Other World Kingdom : ఆ దేశంలో మహిళలదే పరిపాలన..మగవారికి పౌరసత్వం కూడా ఉండదు

  • Updated on- April 20, 2021 / 12:22 PM IST

Other World Kingdom (1)

Other World Kingdom : మహాభారతంలో ఓ అందమైన రాజ్యం గురించి చెప్పాలంటే ప్రమీలా రాజ్యం గురించి చెప్పుకోవాల్సిందే. ఈ రాజ్యంలో మహారాణి ప్రమీల దగ్గర్నుంచి సైనికుల వరకూ అంతా మహిళలే. పాలనే వారిది. ఈరోజుల్లో కూడా మహిళలే పాలించే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అటువంటి దేశం ‘ఇతర ప్రపంచ రాజ్యం’ (Other World Kingdom). బహుశా ఈ దేశం పేరు పెద్దగా ఎవరి విని ఉండరు. పాలనే కాదు అక్కడ అన్నింటిలోను మహిళలదే ఆదిపత్యం. ఆ దేశంలో పురుషులకు కనీసం పౌరసత్వం కూడా ఉండదు అంటే అక్కడ మాతృస్వామ్య పాలన ఎంతగా ఉందో ఊహించుకోవచ్చు..

ఈ ప్రపంచంలో చాలా దేశాల్లో పాలన పరంగా పురుషులు ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయి. కానీ ఐరోపా ఖండంలో ఉన్న ఈ దేశం పేరు ‘ఇతర ప్రపంచ రాజ్యం’ (Other World Kingdom). రాజధాని బ్లాక్ సిటీ. జూన్ 1, 1996 సంవత్సరంలో చెక్ రిపబ్లిక్ నుంచి విడిపోయిన తరువాత ఈ దేశం ఏర్పడింది. 1997లో ఇది బైటిప్రపంచానికి తెలిసిందంటారు.

Other World Kingdom కు మహిళలే క్వీన్లు..
Other World Kingdom దేశ పాలన అంతా మహిళల చేతుల్లో ఉంటుంది. వారి కనుసన్నల్లోనే అంతా నడుస్తుంటుంది. ఇది ఆశ్చర్యం కలిగించే విషయమనే చెప్పాలి. కొన్ని నివేదికల ప్రకారం..ఈ మహిళాధిపత్య దేశాన్ని ప్యాట్రిసియా -1 పరిపాలిస్తున్నారు. అయితే ఇతర దేశాలు.. ఈ దేశానికి అదొక దేశం అనే హోదా ఇవ్వలేదు. అలాగని ఈ దేశం పరాయి దేశాలపై ఆధారపడి జీవించటంలేదు. ఈ దేశానికి సొంతంగా జెండా ఉంది ఎజెండా కూడా ఉంది. సొంతంగా కరెన్సీ కూడా ఉంది. అంతేకాదు..ప్రత్యేక పోలీసు యంత్రాంగంతో పాటు ప్రత్యేక పాస్‌పోర్ట్ ఉంది. అంతా మహిళాధిపత్యం కలిగిన ఈ దేశంలో పురుషులకు కనీసం సిటిజన్‌షిప్ (పౌరసత్వం) కూడా లేదు అంటే అక్కడా మాతృస్వామ్యం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు..

 విచిత్రమైన చట్టాలు..
ఈ దేశం నిర్మాణానికి రెండు మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయట. ఈ దేశ పౌరసత్వం పొందాలంటే పురుషులు కనీసం ఐదు రోజులు రాణి ప్యాలెస్‌లో ఉండాలని నియమం. ఆ ఐదురోజుల పాటు అతను రాణి చెప్పినవన్నీ చేయాలి. ప్రతి ఆదేశాన్ని పాటించి తీరాలి. అంతేకాదు..బయటి ఎవరైనా ఈ దేశానికి వస్తే, సదరు వ్యక్తులు రాణి కూర్చునే సోఫాగా మారాలి. అంటే ఆమె వారిపై కూర్చుంటుంది. ఒక బానిస మద్యం తాగవలసి వస్తే, మొదట ఆ లిక్కర్‌ను రాణి పాదాల వద్ద ఉంచి ఆ తర్వాత ప్రసాదంగా భావించి అత్యంత భక్తితో సేవించాలి. ఇటువంటి ఎన్నో చిత్ర విచిత్రాలు ఈ Other World Kingdom లో ఉన్నాయి.