Pakistan Loan : పాకిస్తాన్ ఖేల్ ఖతం.. దివాళా తీయడానికి రెడీ.. అర్జంట్ గా మా అప్పు కట్టమంటున్న దేశం..

Pakistan Loan : పాకిస్తాన్ కు ఓ దేశం అల్టిమేటం జారీ చేసింది. తాము ఇచ్చిన అప్పును వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది.

Pakistan will repay USD 3 5 billion to the UAE by month end

  • పాకిస్తాన్ కు భారీ షాక్
  • 3. 5 బిలియన్ డాలర్ల అప్పు కట్టాల్సిన పరిస్థితి
  • అల్టిమేటం జారీ చేసిన యూఏఈ

Pakistan Loan : ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం నేపథ్యంలో.. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడు తగ్గుతాయో తెలియదు. ఈ యుద్ధం కారణంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత అనేక దేశాలను కుదిపిస్తుంది. పాకిస్తాన్ లో పరిస్థితి వర్ణించడానికి వీలు లేకుండా ఉంది. ద్రవ్యోల్భణంతో దెబ్బ తిన్న పాకిస్తాన్ కు ఈ యుద్ధం మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది. దీంతో పాక్ పరిస్థితి పెనం మీద నుంచి పోయ్యిలో పడ్డట్టు అయ్యింది. మరి తమ స్థితి ఇంత దయనీయంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండటం మంచిది. కానీ పాకిస్తాన్ మాత్రం.. ఈ యుద్ధం వేళ.. ఇరాన్ కు మద్దతిస్తుంది.

దీంతో అసంతృప్తికి గురైన యునైటెడ్ అరబ్ ఎమరేట్స్ (యూఏఈ) పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చింది. పాక్ తమకు చెల్లించాల్సి ఉన్న 3.5 బిలియన్ డాలర్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. అసలే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇలాంటి సమయంలో యూఏఈ ఇలా డిమాండ్ చేయడం దాయాది దేశానికి పెద్ద సమస్యగా మారబోతుంది. అయితే ఈ రుణాన్ని తిరిగి చెల్లించేందుకు పాక్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక గతంలో పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు యూఏఈ ఈ రుణాన్ని మంజూరు చేసింది. యూఏఈ.. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లో భాగంగా పాకిస్థాన్ కు ఈ నిధులను అందించింది. అయితే ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఈ రుణాన్ని పొడిగిస్తూ వచ్చిన యూఏఈ.. ఈసారి మాత్రం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ లో సేఫ్ డిపాజిట్ గా ఉన్న ఈ మొత్తాన్ని ఈ నెలాఖరు లోగా తిరిగి చెల్లించాలని యూఏఈ పేర్కొన్నట్లు సమాచారం. ఓవైపు చమురు సంక్షోభం.. మరోవైపు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ కు పాకిస్థాన్ మద్దతు అసంతృప్తి.. వెరసి యూఏఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.

యూఏఈ గతంలో సమకూర్చిన ఈ డిపాజిట్ పై పాకిస్తాన్ 6 శాతం వడ్డీ కడుతుంది. ఈ రుణానకిి సంబంధించి యూఏఈ.. 2025 డిసెంబర్ నుంచి కేవలం 2 సార్లు మాత్రమే గడువును పొడిగిస్తూ వచ్చింది. చివరకు ఏప్రిల్ 17 నాటికి గడువును ముగించింది. ప్రస్తుతం పాకిస్తాన్ ఐఎంఎఫ్ ప్రోగ్రామ్‌లో ఉంది. దీనిలో భాగంగా చైనా, సౌదీ అరేబియా, యూఏఈ వంటి భాగస్వామ్య దేశాల నుంచి సుమారు 12.5 బిలియన్ డాలర్ల రోల్‌ఓవర్ ఫైనాన్సింగ్ పొందాల్సి ఉంది.

తాజా గణాంకాల ప్రకారం, పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ వద్ద సుమారు 16.3 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఇందులో 3.5 బిలియన్ డాలర్లు చెల్లిస్తే, దాదాపు 18 శాతం వరకు నిల్వలు తగ్గే అవకాశం ఉంది. దీంతో దిగుమతులకు అవసరమైన విదేశీ కరెన్సీ నిల్వలు భారీగా తగ్గిపోవచ్చని అభిప్రాయపడుతున్న ఆర్థిక నిపుణులు.. ఈ నిర్ణయం పాకిస్తాన్ కరెన్సీపై మరింత ఒత్తిడి తీసుకురావడంతో పాటు, IMF నిబంధనలను పాటించడం కూడా కష్టతరం చేయవచ్చని హెచ్చరిస్తున్నారు. అయితే యూఏఈకి చెల్లించే అప్పుకు సంబంధించిన నిధులపై పాక్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.